Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తండ్రి పోలికలనే కాదు నటనను పుణికిపుచ్చుకుని సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. ఇక నిత్యం తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు, డ్యాన్స్ వీడియోలతో దుమ్మురేపుతూ ఉంటోంది. సర్కారు వారి పాట చిత్ర ప్రమోషన్స్ లో సితార డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది. చదువుతో పాటు సంగీతం, డ్యాన్స్.. అన్ని కళలను సితార నేర్చుకొంటుంది. ఇక నిత్యం ఇంగ్లీష్ సాంగ్స్ తో అదరగొట్టే ఘట్టమనేని వారసురాలు.. తాజాగా తండ్రి నటించిన సినిమా సాంగ్ కు డ్యాన్స్ వేసి ఔరా అనిపించింది. మహేష్ బాబు, త్రిష జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అతడు. ఈ సినిమాలో పిల్లగాలి అల్లరి అంటూ త్రిష వేసిన డ్యాన్స్ ను, ఆ సాంగ్ ను ఎప్పటికి మర్చిపోలేరు. ఇక ఈ సాంగ్ కు సితార స్టెప్స్ వేసి అలరించింది. అచ్చుగుద్దినట్లు త్రిష వేసిన స్టెప్స్ తోనే సీతూ పాప అదరగొట్టేసింది.
ముఖ్యంగా సితార హావభావాలకు అయితే అభిమానులు మంత్ర ముగ్దులు అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ డ్యాన్స్ వీడియోను మహేష్ షేర్ చేస్తూ కూతురును చూసి మురిసిపోయాడు. “నీ కళ్ళలో ఉన్న చిలిపిదనమే.. ఇలా నీ చిన్ని చిన్ని డ్యాన్స్ లను అందరి ముందుకు తీసుకువస్తోంది” అని రాసుకొచ్చాడు. ఇక ఈ వీడియోకు మహేష్ మాత్రమే కాదు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. సితార పాపకు ఇప్పుడు పదేళ్లు వచ్చేసాయి.. త్వరత్వరగా ఎదిగి.. ఘట్టమనేని వారసురాలిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేయ్.. తండ్రి పేరు నిలబెట్టు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఒకవేళ సితార కనుక ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ చూపిస్తే.. ఆమె తన ఎంట్రీని మహేష్ బాబు గ్రాండ్ గానే ప్లాన్ చేస్తాడు.. కానీ, ఇంకా ఆమెకు చాలా సమయం పడుతోంది అని చెప్పొచ్చు.