మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, శృతి హాసన్ జంటగా నటిస్తున్న పొలిటికల్ డ్రామా “లాభం”. సాయి ధన్సిక, కలైయరసన్, పృథివీ రాజన్, రమేష్ తిలక్, డానియల్ అన్నె పోప్, నితీష్ వీర, జై వర్మన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ “లాభం” మూవీని సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో దివంగత చిత్ర దర్శకుడు ఎస్‌పి జననాథన్‌కు నివాళిగా ఈ సినిమా నుంచి “యయామిలి యామిలియా” అనే పాట విడుదల చేశారు.
Read Also : క్షమాపణలు కోరిన సామ్… వారిని ప్రసన్నం చేసుకునే పని..!
విజయ్ సేతుపతితో జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నిర్మాత జననాథన్ కాంబినేషన్ లో 2015లో వచ్చిన చిత్రం “పురంపొక్కు ఎంగిర పొదువుడమై”. ఈ “లాభం” మూవీ వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండవ చిత్రం. ఈ ఏడాది మార్చి నెలలో డైరెక్టర్ చెన్నైలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో పడిపోయారు. ఆయనను ఆసుపత్రికి తరలించగా మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు. మార్చి 13న ఆయన గుండెపోటుతో మరణించాడు. ఆయన నిర్మించిన సినిమా విడుదలయ్యే సమయానికే ఈ లోకంలో లేకుండా పోవడం బాధాకరం.