క్షమాపణలు కోరిన సామ్… వారిని ప్రసన్నం చేసుకునే పని..!

సమంత అక్కినేని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో క్షమాపణలు చెప్పుకొచ్చింది. తన మొదటి వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో సమంత పాత్ర రాజికి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. తమిళులు సమంత సినిమాలో రాజీ పాత్రలో నటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోభావాలు దెబ్బతీశారు అంటూ “బ్యాన్ ది ఫ్యామిలీ మ్యాన్-2” అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రెండ్ చేశారు. “ది ఫ్యామిలీ మ్యాన్ 2” మేకర్స్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. దీంతో కేవలం హిందీలోనే ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేశారు. ఆ తరువాత సామ్ పాత్రపై, ఆమె నటనపై ప్రశంసల జల్లు కురిసింది. ప్రముఖులు సైతం “ది ఫ్యామిలీ మ్యాన్ 2” బృందంపై అభినందనలు కురిపించారు. ఇప్పుడు తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో సామ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎవరినీ బాధ పెట్టాలనుకోలేదని, ఎవరి మనోభావాలైనా దెబ్బ తింటే క్షమించాలని మనస్ఫూర్తిగా కోరింది. మరి ఇప్పటికైనా తమిళ తంబిల ఆగ్రహం చల్లారుతుందేమో చూడాలి.

Read Also : ‘డియర్ మేఘ’ సెన్సార్ పూర్తి.. ‘నవరస’ మేకింగ్‌ వీడియో

మరోవైపు సమంత, గుణ శేఖర్ కాంబినేషన్ లో రూపొందుతున్న “శాకుంతలం” చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. నయనతారతో పాటు “కాతు వాకుల రెండు కాదల్” అనే తమిళ సినిమా కూడా చేస్తోంది. ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక ప్రముఖ బాలీవుడ్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత కొత్త సినిమాలపై సంతకం చేసే మానసిక స్థితిలో లేనని, పని నుండి చిన్న విరామం తీసుకుంటున్నానని వెల్లడించింది. సమంత సినిమాలకు దూరంగా ఉండాలనుకోవడానికి ప్రత్యేక కారణంగా ఆమె వ్యక్తిగత జీవితం కోసం సమయాన్ని కేటాయించాలనుకోవడమేనని అంటున్నారు. 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రొఫెషనల్ సమయం తరువాత సామ్ కొన్ని నెలలు విరామం తీసుకోబోతోంది. ఇటీవల సామ్ తన ఇంటి పేరు అక్కినేనిని సోషల్ మీడియా ఖాతాల నుండి తొలగించడం కూడా హాట్ టాపిక్ గా మారింది.

-Advertisement-క్షమాపణలు కోరిన సామ్… వారిని ప్రసన్నం చేసుకునే పని..!

Related Articles

Latest Articles