keeda Kola:బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు కీలక ఒయాత్రల్లో నటించిన చిత్రం కీడా కోలా. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించి.. ఒక పాత్రలో కూడా నటించాడు. ఇక ఈ చిత్రాన్ని విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను హీరో రానా దగ్గుబాటి సమర్పించడంతో మరింత ఆసక్తి నెలకొంది. కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు.
Batukamma: బతుకమ్మ సంబురాల్లో సందడి చేసిన సీరియల్ తారలు
డిపిరి డిపిరి అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా చాలా క్రేజీగా అనిపిస్తుంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు భరద్వాజ్ గాలి లిరిక్స్ అందించాడు. హనుమాన్ సిహెచ్ తన మెస్మరైజ్ వాయిస్ తో అదరగొట్టాడు. వోకల్స్, లిరిక్స్, ఇన్స్ట్రుమెంట్స్, సాంగ్ ప్రోగ్రామింగ్ అన్నీ న్యూ ఏజ్ సౌండింగ్ తో చాలా క్యాచిగా వున్నాయి. పాటలో వినిపించిన అరబిక్ ర్యాప్ కూడా అలరించింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.