Batukamma: దసరా, బతుకమ్మ.. తెలుగువారు చేసుకొనే అతిపెద్ద పండుగలు. ముఖ్యంగా బతుకమ్మ.. తెలంగాణ మహిళలు ఏ రేంజ్ లో చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూలను పేర్చి.. బతుకమ్మగా చేసి.. అమ్మవారికి సమర్పిస్తారు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబురాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఈ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్, స్టార్ మా సీరియల్ నటులు… తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి నగరంలోని వివిధ ప్రాతాలలో దుర్గా పూజా మండపాల వద్ద సందడి చేశారు. స్టార్ మా యొక్క ప్రముఖ సీరియల్స్ కృష్ణా ముకుంద మురారి, మామగారు, వంటలక్క మరియు పాపే మా జీవనజ్యోతి సీరియల్ నటులు ఎల్.బి. నగర్ లో తమ అభిమానులతో సంతోషంగా గడపటం తో పాటుగా చిరస్మరణీయ క్షణాలను సృష్టించారు.
Nandamuri Kalyan Ram: డెవిల్.. మరో అద్భుతమైన ప్రాజెక్ట్ పట్టాడు
ప్రకాశవంతంగా వెలిగిపోతున్న దుర్గా పూజా మండపాల వద్ద బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ, బహుమతులను అందిస్తూ, సమిష్టి స్ఫూర్తిని చాటుతూ కళాకారులు తమ అభిమానులతో ఆనందోత్సాహాలతో గడిపారు. తమ వీక్షకులతో దృఢమైన బంధాన్ని పెంపొందించుకోవడానికి మరియు ప్రతి పండుగను సంతోషకరమైన అనుభూతిగా మార్చడానికి స్టార్ మా కట్టుబడి ఉంది. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా తమ కళాకారులను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఛానెల్ చేస్తున్న ప్రయత్నం ఐక్యత మరియు వేడుకల యొక్క సంతోషకరమైన క్షణాలను ఆనందంగా గడిపారు.