Kavya Kalyanram: వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట అంటూ గంగోత్రి సినిమాలో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ కావ్యా కళ్యాణ్ రామ్. బాలనటిగా మంచి పేరు తెచ్చుకున్న కావ్య.. మసూద సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే హిట్ ను అందుకున్న ఈ భామ రెండో సినిమాగా బలగం చేసింది. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన కావ్య నటించి మెప్పించింది. ఈ సినిమా ఎంతటి హిట్ టాక్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న కావ్య ప్రస్తుతం ఉస్తాద్ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. కాగా, తాజాగా కావ్య సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం.. ఆమె చేసిన వ్యాఖ్యలే అని చెప్పుకొస్తున్నారు.
Akkineni Nagarjuna: ఈసారి కూడా బిగ్ బాస్ హోస్ట్ మన్మథుడే.. ఇదుగో సాక్ష్యం
విషయం ఏంటంటే.. కావ్య.. ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ వేధింపులను ఎదుర్కొన్నట్లు, ఒక మీడియా కథనంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు వెబ్ సైట్లు రాశాయి. ” నేను కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నాను.. కొంతమంది డైరెక్టర్లు నన్ను బాడీ షేమింగ్ చేశారు” అంటూ ఆమె చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దీంతో అందరి హీరోయిన్లలానే బలగం బ్యూటీ కూడా అవమానాలను ఎదుర్కొంది అని రాసుకొచ్చారు. ఇక ఈ వార్తలు కావ్య వరకు వెళ్లడంతో ఆమె వీటిపై స్పందించింది. అసలు ఇలాంటి వ్యాఖ్యలు తాను చేయలేదని, అవన్నీ రూమర్స్ అని చెప్పుకొచ్చింది. ” అకస్మాత్తుగా కొన్ని ప్రధాన మీడియా సంస్థలు నన్ను దర్శకులు బాడీ షేమ్ చేసినట్లు అసంబద్ధమైన మరియు అసత్యమైన ప్రకటనలను ప్రచారం చేస్తున్నాయని నేను గమనించాను. ఇది నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అసలు ఆవార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
I have come across that suddenly a few major media houses are propagating irrelevant and untrue statements about me being body-shamed by directors, which I have never uttered. Requesting media to not spread such false statements. Thank you
— KavyaKalyanram (@KavyaKalyanram) July 12, 2023