Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్, వెంకట్ ప్రభుతో ఒక సినిమా చేయనున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం విజయ లాస్ట్ సినిమా ఇదే అని, ఈ సినిమా తర్వాత ఇళయ దళపతి రాజకీయ రంగప్రవేశం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే విజయ్ వారసుడు సినిమాతో ప్లాప్ ను అందుకున్నాడు. ఇంకోపక్క వెంకట్ ప్రభు సైతం కస్టడీ సినిమాతో ప్లాపును అందుకున్నాడు. దీంతో ఈసారి ఎలాగైనా విజయ్ తో హిట్టు అందుకోవాలని వెంకట్ ప్రభు చాలా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోని కథతో పాటు క్యాస్టింగ్ ను కూడా చాలా పగడ్బందీగా సెలెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Medicine: మందులు కావాలి బాబోయ్ అంటున్న పాకిస్తాన్.. పెద్ద మనసు చేసుకున్న భారత్
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తలపతి 68 లో విజయ్ సరసన జ్యోతిక నటిస్తుందని తెలుస్తుంది. వీరిద్దరూ కలిసి 2000 సంవత్సరంలో ఖుషీ సినిమాలో నటించారు. ఈ సినిమా విజయ్, జ్యోతికకు భారీ విజయాన్ని అందించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ ఖుషీ పేరుతోనే రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 23 ఏళ్ల తర్వాత జ్యోతిక మరోసారి విజయ్ తో నటిస్తుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే జ్యోతికను మేకర్స్ అధికారికంగా సినిమాలోకి ఆహ్వానించనున్నారట. పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జ్యోతిక.. ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తుంది. కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే.. కీలక పాత్రల్లో కూడా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే లియో సినిమాలో విజయ్.. త్రిషతో జతకట్టాడు. వీరిద్దరి కాంబో కూడా హిట్ కాంబో. దీంతో అభిమానులు అందరూ హిట్ కాంబోస్ ను మళ్లీ రిపీట్ అవుతునందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు విజయకు ఎలాంటి విజయాలను అందిస్తాయో చూడాలి.