Nandamuri Balakrishna: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇక ఈ సినిమాలో రజినీ సరసన రమ్యకృష్ణ నటించగా తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించారు. ఇక మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్యామియో రోల్ లో కనిపించి మెప్పించారు. అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. బీస్ట్ సినిమాతో డిజాస్టర్ డైరెక్టర్ అని పేరుతెచ్చుకున్న నెల్సన్.. జైలర్ సినిమాతో హిట్ డైరెక్టర్ గా మారిపోయాడు. కొడుకు కోసం ఒక తండ్రి ఎంత దూరమైనా వెళ్తాడని చెప్తూనే.. తప్పుచేస్తే కొడుకును కూడా క్షమించేది లేదని జైలర్ ద్వారా చూపించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో రజినీ ఫ్లాష్ బ్యాక్ ఎంత పవర్ ఫుల్ గా చుపించారో.. రజినీ అడగగానే హెల్ప్ చేసే స్నేహితులుగా మోహన్ లాల్, శివన్నను అంతకన్నా ఎక్కువ పవర్ ఫుల్ గా చూపించారు. మాలీవుడ్ కు మోహన్ లాల్.. కన్నడ కు శివన్న.. కోలీవుడ్ కు రజినీ లానే ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి ఒక స్టార్ హీరోను క్యామియో గా తీసుకోవాలని అనుకున్నాడట నెల్సన్. ఆ స్టార్ హీరోను కనుక పెట్టి ఉంటే.. థియేటర్ లు తగలబడిపోయేవి అని అభిమానులు అంటున్నారు.
Mahesh Babu: బాబు ల్యాండింగ్.. ఇక రచ్చ షురూ
ఇంతకీ ఆ హీరో ఎవరనుకున్నారు.. మన నందమూరు బాలకృష్ణ. అవును ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఒక క్యామియో రోల్ కోసం నెల్సన్ బాలయ్యను అనుకున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.. “జైలర్‌లో పవర్‌ఫుల్ కాప్ క్యామియోలో బాల కృష్ణ సర్‌ని జోడించాలని నేను అనుకున్నాను. కానీ స్క్రిప్ట్‌లోని పాత్రకు సరిగ్గా సరిపోకపోవడంతో అది మెటీరియలైజ్ కాలేదు” అని తెలిపాడు. దీంతో మంచి క్యామియో మిస్ అయ్యిందే అని అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్.. రజినీకాంత్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, బాలకృష్ణ.. ఒకే ఫ్రేమ్ లో ఉంటే.. థియేటర్ లను అభిమానులు తగలబెట్టేసేవారు. జై బాలయ్య నినాదాలతో థియేటర్లు పూనకాలతో ఊగిపోయేవి. రజినీ సినిమా అంటే ఖచ్చితంగా క్యామియోలో అయినా బాలయ్య ఒప్పుకొనేవాడు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.