Jr NTR: తారకరత్న పోరాడుతున్నారు.. మీడియాతో జూ. ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR Responds On TarakaRatna Health Condition: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే! ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విమానంలో జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా తీసిన తారక్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘తారకరత్న పోరాడుతున్నారు, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారు, ఆయనకు మెరుగైన వైద్యం అందుతోంది, తారకరత్న క్రిటికల్ కండీషన్ నుంచి బయటపడ్డారని చెప్పలేం, కానీ ఆయన త్వరలోనే కోలుకుంటారు’’ అంటూ తారక్ చెప్పుకొచ్చాడు.
Cheating Couple: సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో దంపతులు భారీ మోసం.. లబోదిబో మంటున్న బాధితులు
Also Read
తారక్ మాట్లాడుతూ.. ‘‘ఈనెల 27వ తేదీన మా కుటుంబంలో ఒక ఊహించని ఘటన చోటు చేసుకుంది. తారకరత్న అన్నకు మెరుగైన వైద్యం అందుతోంది. ఆయన కూడా పోరాడుతున్నారు. తాత సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఎంతోమంది అభిమానుల ఆశీర్వాదం ఆయనకు ఉంది. ఈ పరిస్థతి నుంచి ఆయన త్వరగా కోలుకొని, మునుపటిలాగే మనందరితో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పరిస్థితిలో సహాయం అందిస్తున్న కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్‌కి ధన్యవాదాలు. మరో ఇద్దరు డాక్టర్లను కూడా రప్పించడం జరుగుతోంది’’ అంటూ చెప్పాడు. ఎక్మోలో ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని, తనకు వైద్యులు ఇచ్చిన ధైర్యాన్నే అభిమానులకు తెలియజేస్తున్నానని తారక్ పేర్కొన్నాడు. ఇదే సమయంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. తమ్ముడు తారకరత్న త్వరగా కోలుకోవాలని, అందరూ ఆ దేవుడ్ని ప్రార్థించాలని కోరుకుంటున్నానని అన్నాడు.
Volodymyr Zelenskyy: ట్విస్ట్ ఇచ్చిన జెలెన్‌స్కీ.. రష్యాకి ఊహించని దెబ్బ
అంతకుముందు బాలకృష్ణ మాట్లాడుతూ.. తారకరత్న పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటున్నామని, స్టంట్ వేయడం కుదరలేదని తెలిపారు. అయితే.. మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారని చెప్పారు. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ సైతం స్పందిస్తూ.. తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారన్నారు. కాగా.. తారకరత్నకు మెలెనా వ్యాధి ఉందని, దీని కారణంగా చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతుందని వైద్యులు పేర్కొన్నారు. బ్లీడింగ్ వల్ల పలు భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోతుందన్నారు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా తారకరత్నకు బ్లడ్‌పంపింగ్ చేస్తున్నారు.
Fake Baba: విక్రమార్కుడు సీన్ రిపీట్.. నరదిష్టి ఉందని నగలు కాజేశాడు
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!