Ukraine imposed sanctions against 182 Russian and Belarusian companies: ఉక్రెయిన్, రష్యా మధ్య ఏడాది కాలంగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈమధ్య రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. అక్కడి విద్యుత్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేస్తూ.. వరుస ఎయిర్‌స్ట్రైక్స్‌కి పాల్పడుతోంది. అయినా ఉక్రెయిన్ వెన్నుచూపడం లేదు. పాశ్చాత్త దేశాల సహాయంతో.. రష్యాకు ధీటుగా బదులిస్తోంది. అటు రష్యా కూడా వెనక్కు తగ్గేదే లేదంటూ పోరాడుతుండటంతో.. ఈ రెండు దేశాల మధ్య సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాకు ఊహించని షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా, బెలారస్‌కు చెందిన 182 కంపెనీలను బ్లాక్ చేయడంతో పాటు ముగ్గురు వ్యక్తులపై నిషేధం విధించారు. తద్వారా ఉక్రెయిన్‌తో మాస్కో & మిన్స్క్‌ల సంబంధాలను నిరోధించినట్లు అవుతుందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
Crime News: దారుణం.. మతిస్థిమితం లేని బాలికపై ఇద్దరు అత్యాచారం
జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా, బెలారస్ ఆస్తులను పూర్తిగా బ్లాక్ చేస్తున్నాం. వాటిని మా రక్షణ కోసం వినియోగిస్తాం’’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రకారం.. వస్తువుల రవాణా, వాహనాల లీజింగ్, రసాయన ఉత్పత్తిలో ఉన్న సంస్థలపై ఉక్రెయిన్ ఆంక్షలు విధించింది. రష్యన్ పొటాష్ ఎరువుల ఉత్పత్తిదారు, ఎగుమతిదారు ‘ఉరల్కాలి’.. బెలారస్ ప్రభుత్వ యాజమాన్యంలోని పొటాష్ ఉత్పత్తిదారు బెలారస్కాలి, బెలారసియన్ రైల్వేలు, రష్యాకు చెందిన వీటీబీ-లీజింగ్, గాజ్‌ప్రోమ్ బ్యాంక్ లీజింగ్ వంటి సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థల్ని బ్లాక్ చేయడం.. రష్యాపై ప్రతికూల ప్రభావం తప్పకుండా చూపుతుంది. మరి.. దీనిపై రష్యా ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు.. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి.. వందలాది మంది రష్యన్, బెలారసియన్ వ్యక్తులు, సంస్థలపై ఉక్రెయిన్ ఆంక్షలు విధించింది. కొన్ని దేశాలు కూడా రష్యా ఉత్పత్తులను, ఆ దేశంతో వ్యాపారాలను నిలిపేశాయి.
Female Guise: ట్రెండ్ మార్చిన దొంగలు.. ఆడవేషంలో దొంగతనాలు