కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bajaj Wego Electric Auto: బజాజ్ ఆటోకు చెందిన ‘వెగో’ (Wego) ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సరికొత్త రికార్డులు సృష్టించింది. ఒక్కసారి ఛార్జింగ్‌తో ఏకంగా 394.2 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4,023 కిలోమీటర్ల యాత్రను తొమ్మిది రోజుల్లో పూర్తి చేసింది. ఈ రెండు ఘనతలకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు పొందినట్లు కంపెనీ తెలిపింది.
తమిళనాడులోని నామక్కల్ నుంచి తిరునెల్వేలి వరకు జరిగిన ప్రయాణంలో బజాజ్ వెగో ఈ రికార్డును సాధించింది. ఎలక్ట్రిక్ త్రీ వీలర్ విభాగంలో ఒక్కసారి ఛార్జింగ్‌తో అత్యధిక దూరం ప్రయాణించిన వాహనంగా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన Wego P9018 మోడల్‌కు 296 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఉంది. అయితే రికార్డు ప్రయాణంలో 394.2 కిలోమీటర్లు కవర్ చేసింది. అంటే ప్రకటించిన రేంజ్ కంటే అదనంగా 98.2 కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. అయితే ఈ ప్రయాణంలో వాహనంపై ఉన్న లోడ్, సగటు వేగం, ఛార్జింగ్ విధానం వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
Also Read
- Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
- Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
- Suzuki Ignis EV: Suzuki Ignis EV ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. 26kWh బ్యాటరీ, 90bhp పవర్, పూర్తి వివరాలు ఇవే!
- Toyota Innova Hycross Facelift: భారత్‌లో కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్.. ధర, ఫీచర్లు, E85 హైబ్రిడ్ ప్రత్యేకతలు ఇవే!
ఈ బజాజ్ వెగో మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. 2026 అక్టోబర్ 27న జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ లాల్ చౌక్ నుంచి ప్రారంభమైన యాత్ర నవంబర్ 5న తమిళనాడులోని కన్యాకుమారిలో ముగిసింది. మొత్తం తొమ్మిది రోజుల్లో 4,023 కిలోమీటర్ల దూరాన్ని ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ పూర్తి చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ మార్గాన్ని పూర్తి చేసిన తొలి ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌గా నిలిచినట్లుగా కంపెనీ తెలిపింది.
బజాజ్ వెగో P9018ను రూ.4,41,247 ఎక్స్‌షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఇందులో 17.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. కంపెనీ ప్రకటించిన సర్టిఫైడ్ రేంజ్ 296 కిలోమీటర్లు. ఈ మోడల్లో టూ-స్పీడ్ ట్రాన్స్మిషన్, 36 శాతం గ్రేడబిలిటీ ఉన్నాయి. బ్యాటరీకి ఐదేళ్ల వారంటీని కూడా అందిస్తోంది. బ్యాటరీ సామర్థ్యం, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, రీజెనరేటివ్ బ్రేకింగ్, వాహన డిజైన్ కారణంగా మెరుగైన రేంజ్ సాధ్యమవుతుందని కంపెనీ గతంలో పేర్కొంది. ఈ రికార్డులతో వెగో సామర్థ్యాన్ని బజాజ్ మరోసారి నిరూపించింది.
తాజావార్తలు
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Wanaparthy: పెళ్లి విందుకు ఆహ్వానం లేకుండా వెళ్తున్నారా? జైలు, జరిమానా తప్పదంటూ వార్నింగ్ బ్యానర్..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Hardik Pandya: ముంబై డిమాండ్లకు అంగీకరించని రాజస్థాన్.. హార్దిక్ విషయంలో అసలు ఏం జరిగిందంటే?
-
Netflix Pakistani content India: పాకిస్థానీ వెబ్ సిరీస్ వివాదం.. Netflixకు కేంద్రం కీలక సూచన!
ట్రెండింగ్
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!