Pakistani Astronaut: అంతరిక్షంలోకి బటర్ చికెన్, బీఫ్ నిహారీ.. పాక్ వ్యోమగామి కోసం 100కు పైగా హలాల్ వంటకాలు!
- చైనా సహాయంతో అంతరిక్షానికి వెళ్లిన తొలి పాక్ వ్యోమగామి జీషాన్ అలీ..
- అంతరిక్షంలోకి బటర్ చికెన్, బీఫ్ నిహారీ..
- జీషాన్ కోసం పూర్తిగా హలాల్ ఆహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani Astronaut: చైనా సహాకారంతో పాకిస్తాన్ తన తొలి వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపించింది. ఇలా వెళ్లిన తొలి పాకిస్తానీగా మహ్మద్ జీషాన్ అలీ చరిత్ర సృష్టించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ పెద్ద ఎత్తున పండగలా చేసుకుంటోంది. ఇదిలా ఉంటే, జీషాన్ అలీ కోసం 100కు పైగా హలాల్ ఆహార పదార్థాలతో చైనా ప్రత్యేక మెనూ సిద్ధం చేసింది. ఇందులో బటర్ చికెన్, ల్యాంబ్ కోర్మా, బీఫ్ నిహారీ వంటి వంటకాలు ఉన్నాయి.
40 ఏళ్ల పైలట్ మహ్మద్ జీషాన్ అలీ బుధవారం షెన్‌జౌ-24 వ్యోమనౌకలో తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఇప్పటికే షెన్‌జౌ-23 మిషన్‌కు చెందిన మరో ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు. జీహాన్ అలీ ఆహార అభిరుచులు, పోషక విలువలు, పాకిస్తాన్ ఆహార సంస్కృతిని అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రత్యేక మెనూ రూపొందించారు.
Also Read
- Sheikh Hasina: ‘‘హసీనాకు ఏమైనా జరిగితే..’’ బంగ్లాదేశ్ ప్రధానికి మాజీ అమెరికన్ అధికారి హెచ్చరిక!
- IBM: H-1B వీసాదారులకు IBM షాక్.. అమెరికా వదిలి వెళ్లండి లేదా ఉద్యోగం మానేయండి!
- Space X Shares: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. పిల్లలకూ స్పేస్ ఎక్స్ షేర్లు ఇస్తాం..
- Nvidia: చైనాకు AI చిప్‌లు చేరకుండా అమెరికా వ్యూహం.. నాలుగు దేశాలకు ఎన్విడియా షాక్!
చైనా ఆస్ట్రోనాట్ సెంటర్ పరిశోధకుడు చెన్ జున్లీ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యోమగాములకు అవసరమైన శక్తి, పోషకాలు అందించేలా ఈ వంటకాలను రూపొందించారు. అదే సమయంలో ఇవి తేలికగా ఉండీ, సులభంగా జీర్ణయమ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఆహారం తయారీలో పూర్తిగా ‘‘హలాల్’’ నిబంధనలు పాటించారు. ఇస్లామిక్ ఆహార నియమాలకు అనుగుణంగా వీటిని ఎంపిక చేయడంతో పాటు, వంటల తయారీ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతరిక్ష నౌకలు, స్పేస్ స్టేషన్లలో భూమిపై మాదిరిగా వంట చేయడం సాధ్యం కాదు, దీంతో భూమిపైనే వీటిని సిద్ధం చేసి, ప్రత్యేక ప్యాకింగ్ చేసి అంతరిక్షానికి తీసుకెళ్తారు.
తాజావార్తలు
-
Pakistani Astronaut: అంతరిక్షంలోకి బటర్ చికెన్, బీఫ్ నిహారీ.. పాక్ వ్యోమగామి కోసం 100కు పైగా హలాల్ వంటకాలు!
-
Bala 369 : “సినిమా బాగాలేకపోతే పది మందికి చెప్పండి!”.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్!
-
Arjun: రాముడి కథతో ‘యాక్షన్ కింగ్’ అర్జున్ భారీ స్కెచ్
-
EPFO: PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ నుంచి కొత్త సదుపాయం..?
-
SP Manifesto: 5 రూపాయలకే భోజనం, మహిళలకు ఏటా రూ.40 వేలు.. ఎస్పీ మేనిఫెస్టోలో భారీ హామీలు..
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!