Minister Sridhar Babu: వర్గల్లో‘వింటేజ్ కాఫీ’ ప్లాంట్.. వేయి మందికి కొత్తగా ఉపాధి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడింది. సిద్దిపేట జిల్లా వర్గల్లో రూ.1,500 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ‘వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్’ (VCBL) నూతన తయారీ ప్లాంట్ తొలి దశ పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటుతో రాష్ట్రంలో ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) రంగానికి మరింత ఊతం లభించనుంది.
ఈ నూతన ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు వెయ్యి మందికి పైగా స్థానిక యువతకు నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యూనిట్లో ప్రధానంగా ప్రీమియం ‘ఫ్రీజ్-డ్రైడ్ ఇన్స్టంట్ కాఫీ’ని ఉత్పత్తి చేయనున్నారు. 2027 నాటికి ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి, ఏటా 11 వేల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంటుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
Also Read
- Pakistani Astronaut: అంతరిక్షంలోకి బటర్ చికెన్, బీఫ్ నిహారీ.. పాక్ వ్యోమగామి కోసం 100కు పైగా హలాల్ వంటకాలు!
- EPFO: PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ నుంచి కొత్త సదుపాయం..?
- SP Manifesto: 5 రూపాయలకే భోజనం, మహిళలకు ఏటా రూ.40 వేలు.. ఎస్పీ మేనిఫెస్టోలో భారీ హామీలు..
- CJP: సీజేపీకి బిగ్ షాక్.. దీప్కే, దాస్, రాంకాలకు లుకౌట్ నోటీసులు!
ఇక్కడ తయారయ్యే నాణ్యమైన కాఫీ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు. దీనివల్ల ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించనుంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని వర్గల్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి భారీ పరిశ్రమలు రావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, స్థానికులకు మెరుగైన జీవనోపాధి దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Minister Sridhar Babu: వర్గల్లో‘వింటేజ్ కాఫీ’ ప్లాంట్.. వేయి మందికి కొత్తగా ఉపాధి..
-
Amitabh Bachchan: 26/11 రోజే ముంబైలో కలకలం.. మళ్లీ బిగ్‌బీకి బాంబు బెదిరింపులు!
-
Nandi Awards : ఏకంగా 9 ఏళ్ల ‘నంది’ అవార్డులకు గ్రీన్ సిగ్నల్!
-
Pakistani Astronaut: అంతరిక్షంలోకి బటర్ చికెన్, బీఫ్ నిహారీ.. పాక్ వ్యోమగామి కోసం 100కు పైగా హలాల్ వంటకాలు!
-
Bala 369 : “సినిమా బాగాలేకపోతే పది మందికి చెప్పండి!”.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!