Amitabh Bachchan: 26/11 రోజే ముంబైలో కలకలం.. మళ్లీ బిగ్‌బీకి బాంబు బెదిరింపులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amitabh Bachchan: ముంబై ఉగ్రదాడుల (26/11) 18వ వార్షికోత్సవం రోజున దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి కలకలం రేగింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు మళ్లీ బాంబు బెదిరింపులు రావడం ఇండస్ట్రీతో పాటు పోలీసు వర్గాల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బిగ్‌బీ నివాసం ‘జల్సా’తో పాటు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని మేయర్ ఆఫీస్, ముంబై మెట్రో రైల్ నెట్‌వర్క్‌పై బాంబు దాడులు చేస్తామంటూ గురువారం అధికారులకు ఒక సంచలన బెదిరింపు ఈమెయిల్ అందింది.
అమితాబ్ బచ్చన్ ఇంటికి ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని వారాలుగా జల్సా, బీఎంసీ కార్యాలయాలను టార్గెట్ చేస్తూ మెయిల్స్ వస్తున్నాయి. ఈ నెల 12న కూడా జల్సా బంగ్లా, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, మహాలక్ష్మి స్టేడియం, మేయర్ కార్యాలయం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖల్లో బాంబులు పెడతామని మెయిల్ రావడంతో ముంబై పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఆ ఘటన మరువకముందే, సరిగ్గా 26/11 వార్షికోత్సవం రోజే మళ్లీ బిగ్‌బీ ఇంటికి బాంబు ముప్పు రావడం చర్చనీయాంశమైంది.
Also Read
ముంబై మేయర్ రితు తావ్డే, బీఎంసీ కమిషనర్ అశ్విని భిడేలకు వచ్చిన ఈ తాజా ఈమెయిల్లో ప్రముఖ పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్ సంగీత కచేరీని కూడా నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు. శుక్రవారం (నవంబర్ 27) మహాలక్ష్మి రేస్ కోర్స్‌లో జరగనున్న దిల్జిత్ లైవ్ షోపై దాడి చేస్తామని హెచ్చరించారు. ఖలిస్తాన్, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ.. “బబ్బర్ ఖల్సా (పర్మార్-కెనడా)”, “ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ” పేర్లతో ఈ మెయిల్ పంపారు. ముంబైలో దిల్జిత్ షో నిర్వహిస్తే, నగరం అంతటా వరుసగా 30 రోజుల పాటు గ్రెనేడ్ దాడులు జరుగుతాయని తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు, నవంబర్ 29న బెంగళూరు మాదవరలోని నైస్ (NICE) గ్రౌండ్స్‌లో జరగనున్న దిల్జిత్ దోసాంజ్ షోలోనూ ఐఈడీ (IED) బాంబు పేలుస్తామంటూ రెండు రోజుల క్రితమే ఒక బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇప్పుడు ముంబైలోనూ అమితాబ్ బచ్చన్ బంగ్లా, దిల్జిత్ కాన్సర్ట్‌ను టార్గెట్ చేస్తూ హెచ్చరికలు రావడంతో ముంబై పోలీసులు నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Amitabh Bachchan: 26/11 రోజే ముంబైలో కలకలం.. మళ్లీ బిగ్‌బీకి బాంబు బెదిరింపులు!
-
Nandi Awards : ఏకంగా 9 ఏళ్ల ‘నంది’ అవార్డులకు గ్రీన్ సిగ్నల్!
-
Pakistani Astronaut: అంతరిక్షంలోకి బటర్ చికెన్, బీఫ్ నిహారీ.. పాక్ వ్యోమగామి కోసం 100కు పైగా హలాల్ వంటకాలు!
-
Bala 369 : “సినిమా బాగాలేకపోతే పది మందికి చెప్పండి!”.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్!
-
Arjun: రాముడి కథతో ‘యాక్షన్ కింగ్’ అర్జున్ భారీ స్కెచ్
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!