Tollywood: 2027 సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం.. బరిలో ఏడు సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి సీజన్ అంటేనే అసలైన బంగారు గని. సాధారణ రోజుల్లో వచ్చే కలెక్షన్ల కంటే పండుగ సెలవుల్లో వచ్చే వసూళ్లు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. అందుకే ఏడాది ముందే పెద్ద హీరోలు, క్రేజీ ప్రాజెక్టుల నిర్మాతలు సంక్రాంతి డేట్లపై కర్చీఫ్ వేసేస్తుంటారు. ఇప్పుడు 2027 సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలపై ఒక స్పష్టత వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా ఏడు సినిమాలు పండుగ రేసులో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి.
2027 సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాలలో విశ్వంభర, కాకా ముఖ్యం. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సోషియో ఫాంటసీ సినిమా కావడంతో విశ్వంభర సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. పండుగ బరిలో అన్నింటికంటే పెద్ద సినిమా ఇదే కానుంది. అలానే మెగాస్టార్ చిరంజీవి కాకా కూడా అదే డేటుకు రానుందని అంటున్నారు. అయితేజ్ ఈ రెండిటిలో ఒకటే రిలీజ్ కి రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- Pa.Ranjith: రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు.. అణగారిన వర్గాల గొంతుక! పా.రంజిత్ ట్వీట్ వైరల్..
- Adarsha Kutumbam OTT Release: ఓటీటీలోకి వెంకీ మామ మాస్ జాతర.. రేపటి నుంచే ‘ఆదర్శ కుటుంబం’ సందడి!
- Tollywood: ఇంటర్వెల్ వరకు కాలర్ ఎగరేస్తే.. క్లైమాక్స్‌కు తల పట్టుకుంటున్నారు!
- Tollywood Box Office: పాటలతో పూనకాలు.. కథతో నీరసాలు! టాలీవుడ్లో ఇదేం వింత?
సంబరాల ఏటిగట్టు: సాయి దుర్గ తేజ్ (సాయి ధరమ్ తేజ్) నటిస్తున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా కూడా సంక్రాంతికి రావడానికి సిద్ధమవుతోంది.
మహాకాళి: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో యూత్‌లో దీనికి మంచి క్రేజ్ ఉంది.
ఫ్యామిలీ ప్యాక్: పండుగ సీజన్‌కు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం బరిలోకి దిగుతోంది.
జనవరి 12 విడుదల: టైటిల్‌తోనే ఆసక్తి రేపుతున్న ఈ సినిమా కూడా పండుగ సెలవులనే టార్గెట్ చేసింది.
జార్జ్ క్రిష్: ఈ సినిమా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సంక్రాంతి రేసులోనే నిలబడింది.
థియేటర్ల సర్దుబాటు సాధ్యమేనా?
సరిగ్గా ఇక్కడే ఇండస్ట్రీలో పెద్ద చర్చ, వివాదం మొదలయ్యాయి. సంక్రాంతికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలైతేనే థియేటర్ల కేటాయింపు విషయంలో నిర్మాతల మధ్య గొడవలు జరుగుతుంటాయి. గతంలో కూడా పండుగ సీజన్లో స్క్రీన్లు దొరక్క కొన్ని సినిమాలు వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఏడు సినిమాలు ఒకేసారి వస్తామనడం పెను సంచలనంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సుల సంఖ్య పరిమితం. అందులో మెగాస్టార్ ‘విశ్వంభర’ లాంటి భారీ బడ్జెట్ సినిమాకే అత్యధిక థియేటర్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన థియేటర్లను ఆరు సినిమాలకు పంచడం డిస్ట్రిబ్యూటర్లకు కత్తి మీద సాము లాంటిదే.
ముందు ముందు ఏం జరగవచ్చు?
ప్రస్తుతానికి ఏడు సినిమాలు రేసులో ఉన్నాయని ప్రకటించినా, విడుదల సమయం దగ్గరపడే కొద్దీ సమీకరణాలు మారే అవకాశం ఉంది. పెద్ద సినిమాల ఒత్తిడి తట్టుకోలేక, సరైన థియేటర్లు దొరకని పక్షంలో కొన్ని మీడియం, చిన్న బడ్జెట్ సినిమాలు వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఎవరూ తగ్గకుండా పట్టుబట్టి బరిలో నిలిస్తే మాత్రం, థియేటర్ల పంపకాల విషయంలో ఫిలిం ఛాంబర్ వద్ద పంచాయితీలు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కోత తప్పదు. ఏదేమైనా, 2027 సంక్రాంతికి ముందు నుంచే టాలీవుడ్లో బాక్సాఫీస్ వేడి రాజుకుంది.
తాజావార్తలు
-
Tollywood: 2027 సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం.. బరిలో ఏడు సినిమాలు
-
Pa.Ranjith: రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు.. అణగారిన వర్గాల గొంతుక! పా.రంజిత్ ట్వీట్ వైరల్..
-
Paternity Leave: తమిళనాడులో తండ్రులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు!
-
Vasantha Haimavathi Passes Away: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫ్యామిలీలో విషాదం..
-
GST Registration: వ్యాపారులకు కేంద్రం ఊరట.. ఇక క్షణాల్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు..
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!