వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన మూవీ ‘కోర్ట్’ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. హాస్య నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
Also Read : Tolly Wood : టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోన్న ఇద్దరు యంగ్ భామలు
ఈ సినిమా మొదటి రోజు హౌస్ ఫుల్ బోర్డ్స్ తో మొత్తంగా రూ. 8.10 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజులుకు గాను వరల్డ్ వైడ్ గా రూ.15.90 కోట్లు రాబట్టింది. మొదటి వీకెండ్ మూడురోజులకు గాను రూ. 24.4 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వర్కింగ్ డేస్ లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిన కోర్ట్ 10 రోజుల కు వరల్డ్ వైడ్ గా రూ. 50 కోట్ల రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండవ వారంలోను మంచి కలెక్షన్స్ రాబడుతున్న కోర్ట్ మూడవ వారంలోకి అడుగుపెడుతోంది. రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు వస్తున్నా కూడా మూడవ వారంలో కోర్ట్ కు దాదాపు నలభైకి పైగా స్క్రీన్స్ ఉన్నాయాంటే ఈ సినిమా ఎటువంటి ప్రదర్శన చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించి బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.