టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. ఈ ఏడాది ఆరంభంలో దిల్ రాజు ఒక సినిమా భారీ లాభాలు తెచ్చిపెడితే మరో సినిమా భారీ నష్టాలు తెచ్చింది. అటు బయ్యర్స్ కు కూడా భారీ నష్టాలు మిగిల్చాయి. దీంతో దిల్ రాజు ఇప్పడు గేర్ మార్చాడు. ఇక నుండి తన బ్యానర్ నుండి రాబౌయే సినిమాల పట్ల చాలా జాగ్రత్తలు తెలుసుకుంటున్నాడు. ఇప్పటికి రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో మూడు సినిమాలు లాక్ చేసి ఉంచాడు.
Also Read : Saiee Manjrekar : మోడ్రన్ లుక్ లో మెలికలు తిరుగుతున్న మంజ్రేకర్
పాన్ ఇండియా స్థాయిలో ప్లాప్ ఇచ్చిన దిల్ రాజు ఈ సారి ఈలాగైనా పాన్ ఇండియా సినిమా తీసి సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకోసం ఈ సారి ఏకంగా మలయాళ దర్శకుడిని లైన్ లో పెట్టాడు దిల్ రాజు. ఇటీవల మలయాళంలో ఉన్ని ముకుందన్ హీరోగా ‘మార్కో’ సినిమాను తెరకెక్కించాడు హనీఫ్ అదేని. ఈ దర్శకుడిని టాలీవుడ్ కు పరిచయం చేస్తూ ఓ సినిమాను రూపొందించబోతున్నాడు దిల్ రాజు. అయితే ఈ సినిమాకు ఇప్పుడు హీరోల సమస్య వచ్చిపడింది. ఈ సినిమాకు ఇద్దరు హీరోలు కావాలి. ముందు హీరోలు ఎవరు అన్నది ఫిక్స్ చేసుకున్నాక కేవలం తెలుగులోనే తీయాలా లేదా పాన్ ఇండియాగా తీయాలా అనేది డిసైడ్ అవుతారట దిల్ రాజు. పాన్ ఇండియా సినిమా తీసి హిట్ కొట్టాలన్నది దిల్ రాజు కసి. కానీ దిల్ రాజుకు ఇప్పుడు డేట్స్ ఇచ్చే హీరో ఎవరు అనేది క్వచ్చన్ మార్క్. యంగ్ హీరోలందరూ నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నారు. అదే ఒకప్పటి దిల్ రాజు అయితే హీరోలు ఎదురెళ్ళి మరి డేట్స్ ఇచ్చేవారు. ఇప్పడు పరిస్థితులు కాస్త భిన్నం. సో దిల్ రాజు హీరోల వేట మొదలెట్టక తప్పదు.