Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. ఎట్టేకలకు జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక కలక్షన్స్ పరంగా చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ విలువ 135 కోట్లు కాగా, సినిమా 3 రోజుల్లో 56 శాతం రికవరీ అయింది. మరో 3 రోజుల పాటు ఇదే జోరును ఈ సినిమా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వీక్ ముగిసేనాటికి ఈ సినిమాకు 164 కోట్లన రాబట్టి షేక్ చేసింది. ఇంకోపక్క ఈ సినిమాకు చిత్ర బృందం హైప్ తీసుకొస్తున్నారు. సినిమా ముందు చేయాల్సిన ప్రమోషన్స్.. ఇప్పుడు చేస్తున్నారు. మహేష్ బాబు, శ్రీలీల ఇంటర్వ్యూలు, ప్రోమోలు, హైలైట్ సాంగ్స్ లిరికల్ వీడియోలు వదులుతూ హైప్ పెంచుతున్నారు. కావాలనే కొంతమంది ఈ సినిమాపై నెగెటివ్ టాక్ తెచ్చారని మరికొంతమంది చెప్పుకొస్తున్నారు.
ఇకపోతే త్రివిక్రమ్ సినిమా అంటే.. హీరో ఫైట్ సీన్ కు ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమాలో అయితే.. కేవలం కృష్ణుడు సాంగ్ ఉంటుంది. ఇక అల వైకుంఠపురంలో చిత్తరాల సిరపడు సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు అలాంటి స్పెషల్ సాంగే గుంటూరు కారంలో ఉంది. అదే రమణ ఏయ్.. మహేష్ ఫైట్ చేస్తుండగా.. వెనుక ఈ సాంగ్ వస్తూ ఉంటుంది. రమణ క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ రాసిన లిరిక్స్ ఒక ఎత్తు అయితే.. థమన్ మ్యూజిక్ మరో ఎత్తు. సూపులకే చుక్కాపండు.. కొట్టాడంటే మిర్చి పండు.. యేశాల్, గీశాల్ పక్కన పెట్టి.. మాటే వినుండ్రి అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అసలు..రమణ ఏయ్ మ్యూజిక్ మాత్రం మైండ్ లో నుంచి పోవడం లేదని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.