ప్రభాస్,కృతి సనన్ హీరో హీరోయిన్ లు గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్”.
ఈ పీరియాడిక్ వండర్ ఇప్పటికే ఎన్నో వివాదాలను, విమర్శలను ఎదుర్కొన్నది.తాజాగా మరోసారి వార్తల్లో అయితే నిలిచింది. తాజాగా ట్రైలర్ లో ఓం రౌత్ మరో తప్పు చేసాడని చాలా మంది అంటున్నారు.హనుమంతుడి ని బాగా నమ్మే రాముడు సీతమ్మను వెతికే పనిని ఆయనకు అప్పజెబుతాడు .. ఆమె కనిపిస్తే రాముడు దూత అని తెలియజేసే విధంగా తన ఉంగరాన్ని హనుమంతుడికి రాముడు ఇస్తాడు.. హనుమంతుడి లంకకు చేరుకొని సీతమ్మను గుర్తించి రాముడి క్షేమాన్ని తెలియజేసే ఉంగరం సీతమ్మ చేతికి సీహి అలాగే రాముడుకి ఇవ్వడానికి సీతమ్మ తన చూడామణి తీసి హనుమంతుడి కి ఇస్తే రాముడుకు దానిని ఆయన చేరవేస్తాడు.. ఇదంతా మనం ఇప్పటి వరకు రామాయణ కథలలో అయితే చూసాము.
అయితే ఈ సన్నివేశాన్ని ఇప్పుడు ఆదిపురుష్ లో ఓం రౌత్ పూర్తిగా మార్చేసి చూపించాడు.. చూడామణి బదులుగా సీతమ్మ ఇందులో తన గాజును హనుమంతుడి కి ఇచ్చిందని చూపించాడు.ఇది ట్రైలర్ లో స్పష్టంగా అయితే చూపించారు.. రాముడికి తన ఆనవాలుగా గాజును ఇచ్చినట్టు ఏ రామాయణం లో ఉన్నది అనే అనుమానం ఇప్పుడు అందరి లో ను కలుగుతుంది. ఓం రౌత్ ఏ ఆధారాలతో చూడామణి బదులుగా గాజును చూపించారు అని కొంతమంది ఆయన పై మండిపడుతున్నారు.మరి ఈ సన్నివేశం చుసిన తర్వాత రామాయణం లో ని ఇంకెన్ని విషయాలను ఆయన వక్రీకరించారు అని ఫ్యాన్స్ కూడా తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.మరి ఈ సినిమా విడుదలయితే కానీ అసలు సంగతి బయటకు రాదు.. రాముడి కథను మార్చి కనుక తీస్తే సినిమాకు నెగటివ్ టాక్ వస్తుంది. దాని ప్రభావం కలెక్షన్స్ పై పడుతుంది అని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.