Dil Raju: తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు నేడు పోటాపోటీగా జరిగిన విషయం తెల్సిందే. సి. కళ్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఇక ఈ పోటీలో దిల్ రాజ్ ప్యానెల్ ఘనవిజయం సాధించిన విషయం తెల్సిందే. మొత్తం 891 ఓట్లకు గాను, దిల్ రాజు ప్యానెల్ 563 ఓట్లను సాధించగా సి. కళ్యాణ్ ప్యానెల్‌కు 497 ఓట్లు వచ్చాయి. దిల్ రాజు ప్యానెల్ నిర్మాతల విభాగంలో 12కి 7 విజయాలు దక్కించుకోగా.. స్టూడియో సెక్టార్ నుంచి గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్‌లో చెరో ఆరుగురు గెలిచారు. ఇక మొత్తం 48 ఓట్లలో దిల్ రాజుకి 31 ఓట్లు పడ్డాయి. దీంతో దిల్ రాజు ప్రెసిడెంట్‌గా అధికారం అందుకున్నారు. కాగా, వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్‌గా ప్రసన్న కుమార్ ఎంపికయ్యారు. ఇక దీంతో దిల్ రాజు ప్యానెల్ తో పాటు సినీ ప్రముఖులు దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Sai Rajesh: చిరంజీవికి ఆ అదృష్టం లేదు.. ‘బేబీ’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
ఇక మొదటి నుంచి దిల్ రాజు ఈ ఎన్నికల్లో నిలబడడానికి ఒకే ఒక కారణం చెప్తూ వచ్చారు. చిన్న సినిమాలకు అండగా ఉంటూ.. పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయడానికే తాను ఈ ఎన్నికల్లో నిలబడినట్లు చెప్పుకొచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందించాలనే నినాదంతోనే ఆయన పోటీలో నిలబడ్డారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి దిల్ రాజు.. సి. కళ్యాణ్ ప్యానెల్ ను క్లీన్ స్వీప్ చేసేశారు.