Sai Rajesh: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం బేబీ. ఎస్ కేఎన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 14 న నెల రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు రికార్డు కలెక్షన్స్ ను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలను మోసం చేసే కథగా తెరకెక్కడంతో అభిమానులు ఈ సినిమాకు క్యూ కట్టారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ సినిమాను ప్రశంసించాడు. ఆ తర్వాత అల్లు అరవింద్ కూడా ఒక ప్రెస్ మీట్ ద్వారా బేబీ చిత్రాన్ని ప్రశంసించాడు. ఇక తాజాగా ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. బేబీ మూవీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్ అనే పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఈ ప్రెస్ మీట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
Tamannaah Bhatia: బాపుకే దొరకని బొమ్మవే.. బ్రహ్మకే వన్నె తెచ్చిన వెన్నెలమ్మవే
ఇక ఈ ఈవెంట్ లో డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. “మెగాస్టార్ అభిమానిగా ఎప్పుడూ గర్వపడుతుంటా. హైదరాబాద్ వచ్చిన కొత్తలో చిరంజీవి గారిని కలిస్తే చాలనుకున్నా. బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి బ్లడ్ ఇచ్చి వస్తుంటే చిరంజీవిగారు వస్తున్నారు అని చెప్పారు. మేము బలంగా అనుకుంటే మీరు తప్పకుండా కలుస్తారు. బేబీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మీరు రావాలని, వస్తారని అనుకున్నాం. అప్పుడు యూఎస్ లో ఉన్నారు. కానీ మేము గట్టిగా నమ్మాం మమ్మల్ని బ్లెస్ చేసేందుకు మీరు వస్తారని. ఇవాళ సక్సెస్ మీట్ కు వచ్చారు. మీరు ఒక విషయంలో అన్ లక్కీనో నేను చెప్తాను. ఒక చిరంజీవి అభిమానికి ఉండే అదృష్టం మీకు లేదు. మా లైఫ్ ఎప్పటికి మీరు చూడలేరు. ఏం ఏం చేస్తాం.. ఎలా ఉంటాం అనేది మీకు తెలియదు. అభిమానులుగా మేము బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా గుర్తొచ్చేది మీరే, వినేది మీ పాటే. మా పారాసిటమాల్ మీరే.. మా మ్యాన్షన్ హౌస్ మీరే.. అది అమెరికా అయినా, చిన్న ఊరిలో ఆటోవాలా అయినా మీ సినిమాలు, మీ పాటలే అసలైన కిక్కు. ఇవాళ మిమ్మల్ని ఈ ఫంక్షన్ లో చూస్తుంటే ఎన్నో మెమొరీస్ గుర్తొస్తున్నాయి. నేనొక సినిమాకు వెళ్ళాను.. ఆ సినిమా టైటిల్స్ తరువాత పెద్ద ఎన్టీఆర్ గారి ఫోటో వచ్చింది. ఎంతమంది డైరెక్టర్ లకు ఎన్ని సినిమాలు ఇచ్చారు. ఎన్ని హిట్లు ఇచ్చారు. ఒక్కరైనా మీ ఫోటో వేసినవారు లేరు. అప్పుడే అనుకున్నా.. నేను డైరెక్టర్ అయితే.. మీ ఫోటో నే వేయాలి అని.. నా మూడు సినిమాలకు నేను మీ ఫోటోనే వేసాను.. నాకు దేవుడు అంటే నమ్మకం లేదు.. నా దేవుడు మీరే. మనస్ఫూర్తిగా మెగాస్టార్ కు థాంక్స్ చెబుతున్నాం” అని ముగించాడు.