Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో ధనుష్ ఎంత ఫేమసో.. తెలుగులో కూడా అంతే ఫేమస్. ఇక ఈ ఏడాది సార్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక ఈ మధ్యనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేశంగా ఆకట్టుకుంది. కెప్టెన్ మిల్లర్ కోసమే .. ధనుష్ బారు గడ్డం, పొడవాటి జుట్టు పెంచుతూ వస్తున్నాడు. ఎప్పుడు చూసినా అదే లుక్ లో దర్శనమిచ్చాడు. సడెన్ ఆ లుక్ లో ధనుష్ ను చూసిన వారందరూ.. రామ్ దేవ్ బాబా లా ఉన్నాడు.. ఆయన బయోపిక్ తీస్తున్నారా అంటూ కామెంట్స్ పెట్టుకొచ్చారు.
Good Night: డిస్నీ+హాట్ స్టార్‌లో సందడి చేస్తున్న ‘గుడ్ నైట్’
ఇక తాజాగా ఆ లుక్ నుంచి ధనుష్ బయటికి వచ్చాడు. ఎట్టకేలకు ధనుష్ రామ్ దేవ్ బాబా లుక్ కు మోక్షం కలిగించాడు. కెప్టెన్ మిల్లర్ షూటింగ్ పూర్తికావడంతో ఆయన తిరుపతిలో తన తలనీలాలు సమర్పించాడు. నేడు తిరుమలలో ధనుష్ సందడి చేశాడు. కొడుకుతో కలిసి స్వామి వారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించాడు. ప్రస్తుతం ధనుష్ లుక్ ఆకట్టుకొంటుంది. ఇక ధనుష్ సినిమాల విషయానికొస్తే.. కెప్టెన్ మిల్లర్ కాకుండా మరో రెండు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఒకదానికి ధనుషే దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది.