Good Night Streamnig in Disney+ Hotstar: ఈ మధ్య చాలా చిన్న విషయాలు బేస్ చేసుకుని కూడా సినిమా తెరకెక్కిస్తున్నారు, అవి కూడా మంచి హిట్ అవుతున్నాయి. నిజానికి మనలో చాలా మంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంటారు, కదా ఇది చిన్న విషయమే అయినా ప్రతిరోజూ అనుభవించే వారు మాత్రం నరకంలా ఫీల్ అవుతారు. ఇది చెప్పుకునేంత పెద్ద సమస్య కాదు అలా అని చిన్న సమస్య కూడా కాదు, ఇలాంటి గురక బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచన రావడమే కాదు ఏకంగా దానిమీదనే సినిమా కూడా చేశారు. తమిళ దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించగా తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది. కేవలం తమిళం మాత్రమే కాదు తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లోకి కూడా అందుబాటులోకి వచ్చేసింది.
Bandla Ganesh: గురు పూర్ణిమ.. దూరంగా ఉంటా అంటూ బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్
అసలు ఈ సినిమా కథ ఏంటంటే ఈ సినిమాలో హీరోకి గురక సమస్య ఉంటుంది, అక్కాబావతో కలసి నివసించే అతనికున్న గురక సమస్య వల్ల నిత్యం ఎవరొకరితో తిట్లు తింటూ ఉంటాడు. కొన్నాళ్లకు హీరోయిన్ పరిచయం అయ్యి ప్రేమలో పడి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. తనకు గురక సమస్య ఉందనే విషయం ముందు నుంచీ హీరోయిన్ దగ్గర దాస్తూ రాగా పెళ్లి తర్వాత అసలు విషయం బయటపడుతుంది. ఈ క్రమంలో గురక వల్ల వారి మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఈ క్రమంలో ప్రేమించి పెళ్లి చెసుకున భర్త సమస్య భార్య అర్థం చేసుకుందా లేదా తర్వాత ఏం జరిగింది? అనేది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో మణికందన్, మీరా రఘునాథ్ హీరో, హీరోయిన్లు కాగా రమేష్ తిలక్, రేచల్ రెబెక్కా, బాలాజీ శక్తివేల్, భగవతి పెరుమాళ్ వంటివారు కీలక పాత్రలు పోషించారు. యువరాజ్ గణేశన్, మగేష్ రాజ్ పసిలియన్, నజెరత్ పసిలియన్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.