యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్ కు సంబంధించిన పిక్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. తాజాగా థమన్ గతంలో, ఇప్పుడు తాను ఎలా ఉన్నాడో తెలుపుతూ ఓ పిక్ షేర్ చేశాడు. ఈ పోస్ట్ లో ఏకంగా 137 నుండి 101 కిలోలకు చేరుకున్నట్టు వెల్లడించాడు. అంటే దాదాపు 36 కిలోలు తగ్గిపోయాడన్నమాట. థమన్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో తన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ కు సంబంధించిన పిక్ షేర్ చేస్తూ “అలా జరింగింది అన్నమాట !! 137 కిలోల నుండి 101 కిలోల వరకు” అంటూ కామెంట్ చేశాడు. బరువు తగ్గడం వల్ల ఈ మ్యూజిక్ డైరెక్టర్ లుక్ మరింత హ్యాండ్సమ్ గా మారింది.
Read Also : బీచ్ వేర్ లో హీట్ పెంచేస్తున్న పూజాహెగ్డే
ఇక థమన్ జనవరిలో COVID-19 బారిన పడిన విషయం తెలిసిందే. వర్క్ ఫ్రంట్‌లో దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి శివకార్తికేయన్ చేయనున్న తదుపరి చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. తాత్కాలికంగా SK20 అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం శివకార్తికేయన్ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేయనుంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ పై నారాయణ్ దాస్ నారంగ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’కు, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’కు కూడా థమన్ సంగీతం అందిస్తున్నారు.