చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఈ సంక్రాంతికి భారి బాక్సాఫీస్ ఫైట్ జరగబోతోంది. ఇద్దరు స్టార్ హీరోలు తమకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ లో కనిపించనుండడంతో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలపై సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. బాలయ్య సినిమాకి మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడనున్నాయి, చిరు సినిమా జనవరి 14న ఆడియన్స్ ముందుకి రానుంది. ఒకే బ్యానర్ నుంచి ఒక్క రోజు గ్యాప్ లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి, సంక్రాంతికి రిలీజ్ అయ్యే రెండు సినిమాలు బాగా ఆడాలి అన్నాడు బాలకృష్ణ. వీర సింహా రెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలకృష్ణ, “ఈ సంక్రాంతికి రెండు సినిమాలు హిట్ అవుతాయి. పోటీ ఉంటేనే మంచి సినిమాలు వస్తాయి అప్పుడే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది.” అన్నాడు. చిరుతో పోటీ గురించి బాలయ్య మాట్లాడడం ఇదే మొదటిసారి.
Read Also: Chiru: నేను ఇగోకి వెళ్తే సినిమా నష్టపోతుంది… ఇందుకే నువ్వు మెగాస్టార్ అయ్యావు బాసు
ఇటివలే మెగాస్టార్ కూడా బాలయ్యతో పోటీ గురించి మాట్లాడుతూ… రెండు సినిమాలని చూసి ఎంజాయ్ చెయ్యండి, రెండు సినిమాలు హిట్ అవ్వాలి అంటూ మాట్లాడాడు. ఎంత పోటీ ఉన్నా కూడా ఇద్దరు హీరోలు ఒకరి సినిమా ఆడాలి అని ఇంకొకరు కోరుకోవడం గొప్ప విషయం. మరి మన స్టార్ హీరోలు కోరుకున్నట్లు చిరు, బాలయ్యల సినిమాలు రెండూ హిట్ అయ్యి 2023లో టాలీవుడ్ కి గ్రాండ్ ఓపెనింగ్ ఇస్తారేమో చూడాలి. ఇప్పుడు రెండు సినిమాల పైన ఉన్న హైప్ కి కాస్త పాజిటివ్ టాక్ తోడైతే చాలు మెగాస్టార్, నటసింహాలు కలిసి బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడం గ్యారెంటీ.