తెలుగు సినిమా దర్శకుడు పూరి జగన్నాధ్ తనదైన శైలిలో వినూత్న కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. అయితే గత కొంత కాలంగా మాత్రం వరుస డిజాస్టర్లు ఆయనని పలకరిస్తున్నాయి. ఇక ఆయనకు హీరో దొరకడం కష్టమే అని భావిస్తున్న సమయంలో తాజాగా, ఆయన కథను సింగిల్ సిట్టింగ్‌లో విని ఒప్పుకున్నారు ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి. ఈ ఆసక్తికరమైన కాంబినేషన్ తెలుగు, తమిళ సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. విజయ్ సేతుపతి, తాను చేస్తున్న ఇతర సినిమాలను కూడా పక్కనపెట్టి ఈ ప్రాజెక్ట్ కోసం కాల్‌షీట్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యారంటే, స్క్రిప్ట్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పూరీ సన్నిహితులు. నిజానికి కోవిడ్ తర్వాత ప్రేక్షకుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది.
Khakee The Bengal Chupur : బెంగాల్ టైగర్ ‘ఖాకీ’గా సౌరభ్ గంగూలీ
వాణిజ్య సినిమాలతో పాటు కంటెంట్ ఆధారిత, విభిన్నమైన కథలను ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాధ్ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విజయ్ సేతుపతి వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న నటుడు కాగా, పూరి యాక్షన్ – ఎమోషనల్ డ్రామాతో కూడిన స్క్రిప్ట్‌లకు పెట్టింది పేరు. ఈ కలయిక ఖచ్చితంగా ఒక సరికొత్త అనుభవాన్ని అందించనుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఉగాది రోజన అనౌన్స్ చేయనున్నారు. ఇద్దరు టాలెంటెడ్ వ్యక్తుల కలయికతో రూపొందనున్న ఈ సినిమా, 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కాంబో నుంచి ఏ స్థాయి మ్యాజిక్ చూడబోతున్నామోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.