నార్నె నితిన్ లీడ్ రోల్ లో వస్తోన్న చిత్రం ‘ఆయ్’, ఆగస్టు 15న ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ – బన్నీలు వస్తారని వార్తలు వినిపించాయి. కానీ అవేవి వాస్తవం కాదని యూనిట్ కొట్టి పారేసింది. కాగా నేడు జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ బ్యూటీ శ్రీలీల, యంగ్ హీరో నిఖిల్, బలగం వేణు, దర్శకుడు చందు మొండేటి తదితరులు ముఖ్య అతిదులుగా హాజరుకానున్నారు.
Also Read: CommitteeKurrollu : కమిటీ కుర్రోళ్ళు అన్నంత పని చేసారుగా.. ఏమిచేశారంటే..?
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న రాబోతున్న ఈ సినిమా నైజాం తలనొప్పులు తేరినట్టేనని తెలుస్తోంది. నైజాం రిలీజ్ విషయంలో ఆసియన్ సురేష్, వరంగల్ శ్రీను, నల్ల వాసు వంటి డిస్ట్రిబ్యూటర్ల పేర్లు వినిపించాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ కొనుగోలు చేసిన నిరంజన్ రెడ్డి రిలీజ్ చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్.
Also Read: Devara : ట్రోలింగ్ టూ రికార్డు బ్రేకింగ్.. NTR కి మాత్రమే చెల్లింది..
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాద్ లో ఆర్టీసీ రోడ్ లోని సుదర్శన్ 35MMలో సాయంత్రం 5:00 గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర హీరో నాని, వివేక్ ఆత్రేయ, హీరోయిన్ ప్రియాంక మెహన్, నిర్మాత DVV. దానయ్య హాజరుకానున్నారు. గతంలో నాని, ఆత్రేయ కాంబోలో వచన అంటే సుందరానికి నిరుత్సహపరిచడంతో ఈ దఫా హిట్టు కొట్టేందుకు వస్తున్నారు.