నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. ఆగస్ట్ 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది కమిటీ కుర్రోళ్ళు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది.
Also Read : CommitteeKurrollu: టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న ‘కమిటీ కుర్రోళ్ళు’
కాగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను వంశీ నందిపాటి కొనుగోలు చేసారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్ళు భారీ విజయం సాధించింది. రిలీజ్ రోజుకంటే రెండవ, మూడవ రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా సూపర్ హిట్ మౌత్ టాక్ తో దూసుకెళుతుంది. ఫస్ట్ డే 1.63 కోట్లు రాబట్టింది. రెండు రోజులకు 3.69 కోట్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక మూడవ రోజు మొదటి వీకెండ్ ముగిసే నాటికి ,మొత్తం 6.04కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను షాక్ ఇచ్చింది. సోమవారం డీసెంట్ కలెక్షన్స్ రాబట్టి నాలుగు రోజులకు గాను మొత్తంగా 7.48 కోట్లు థియేటర్ల నుండి సాధించి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కంప్లిట్ చేసుకుంది ఈ సిమిమా. దింతో ఆ ఆనందాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ అధికారక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్నిఆధరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు యూనిట్ సభ్యులు.