తెలుగు సినీ పరిశ్రమలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్‌లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌తో పాటు 72 మంది యాక్టివ్ నిర్మాతలు పాల్గొననున్నారు.
Also Read : Suriya 46: సూర్య సినిమాలో బాలీవుడ్ హీరో.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
తెలుగు సినీ కార్మికులు 30 శాతం వేతన పెంపు, రోజువారీ వేతన చెల్లింపులు జరగాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4, 2025 నుంచి షూటింగ్‌లను బంద్ చేశారు. ఫెడరేషన్ నాయకులు అనిల్ వల్లభనేని, అమ్మిరాజు కానుమిల్లి, టీవీ అలెగ్జాండర్‌లు నిర్మాతలు 30 శాతం వేతన పెంపునకు లిఖితపూర్వక హామీ ఇస్తేనే షూటింగ్‌లకు కార్మికులు హాజరవుతారని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో టాలీవుడ్‌లో చిత్రీకరణలు పూర్తిగా ఆగిపోయాయి, పలు పెద్ద సినిమాలకు ఆటంకం ఏర్పడింది. నిర్మాతలు ఈ డిమాండ్‌ను ఆమోదయోగ్యం కాదని, ప్రస్తుతం అందిస్తున్న వేతనాలు కనీస వేతనాల కంటే ఎక్కువగానే ఉన్నాయని వాదిస్తున్నారు.
Also Read : V.N Adithya: ఎవడికిరా నష్టం.. అడుక్కు తినాల్సి వస్తుంది జాగ్రత్త.. సినీ సమ్మెపై దర్శకుడు సంచలనం
నిర్మాతల ప్రతిపాదనల్లో ముఖ్యమైన ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ విషయంలో ఫెడరేషన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 9 గంటల నుంచి 9 గంటల వరకు చేస్తే తమకు అభ్యంతరం లేదంటున్న ఫెడరేషన్, నిర్మాతలు ప్రతిపాదించిన వేతన పెంపు కొద్దిగా మార్చి 20 శాతం ఇప్పుడు ఇచ్చి ప్రతి సంవత్సరం పది పది శాతం చొప్పున పెంచాల్సిందిగా కోరినట్టు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి ఇంట్లో ఫెడరేషన్ నాయకులు ఉండగా దాదాపు 50 మంది సభ్యులు కూడా సమావేశం అయినట్టు తెలుస్తోంది. ఇక ఫెడరేషన్ సానుకూలంగా స్పందించిన క్రమంలో వీటిపై ఛాంబర్ లో అత్యవసర చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు.
ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతల మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ నేతృత్వంలో 72 మంది యాక్టివ్ నిర్మాతలు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, మైత్రీ రవి, నాగ వంశీ, శివలెంక కృష్ణ ప్రసాద్, రాధామోహన్, ఠాగూర్ మధు, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, డి.వి.వి. దానయ్య వంటి ప్రముఖ నిర్మాతలు హాజరవుతున్నారు.