కొలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 46వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చుట్టూ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించనున్నారన్న వార్తలు ఇటీవల భారీగా వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్‌పై తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి స్పందిస్తూ..
Also Read : R Madhavan: అంకుల్ అని పిలిస్తే అంగీకరించాల్సిందే !
“అనిల్‌కపూర్‌ను మేము ఎప్పుడూ కలవలేదు. ఆయనతో ఫోన్‌లో కూడా మాట్లాడలేదు. కానీ, ఎక్కడి నుంచి ఈ వార్తలు పుట్టుకొచ్చాయో మాకు తెలియదు. ఇలాంటి రూమర్స్‌ను నమ్మకండి. అధికారికంగా మేము చెప్పిన సమాచారాన్నే నమ్మండి” అని స్పష్టం చేశారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, 45 ఏళ్ల క్రితం అనిల్‌కపూర్ ‘వంశవృక్షం’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఆయన మళ్లీ సూర్య సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారని గాసిప్స్ రావడం మరింత హడావుడి చేసింది. కానీ దర్శకుడు స్వయంగా ఖండించడంతో ఈ రూమర్స్‌కు బ్రేక్ పడింది. ‘సార్’ , ‘లక్కీ భాస్కర్’ సినిమాల తర్వాత వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద అంచనాలు రెట్టింపయ్యాయి. ఇందులో మమితాబైజు హీరోయిన్‌గా, అలాగే రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ ‘సూర్య 46’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. మేకర్స్ ఈ సినిమాను వచ్చే 2026 వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.