తెలుగు సినీ పరిశ్రమలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్‌లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌తో పాటు 72 మంది యాక్టివ్ నిర్మాతలు పాల్గొననున్నారు.…