టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి అరెస్ట్ అయ్యింది. బర్త్ డే పార్టీలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి గంజాయి సేవిస్తుండగా ఆ నటిని పట్టుకున్నారు ఎన్సీబీ అధికారులు. జూహూలో ఉన్న ఓ హోటల్ లో బాయ్ ఫ్రెండ్ అషిక్ సాజిద్ తో కలిసి పార్టీ నటి పార్టీ జరుపుకుంటుంది. అయితే గత ఆదివారం తెల్లవారుజామున అధికారులు నటితో పాటి బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకోగా… ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా నిషేదిత ఉత్ర్పేరకాలు వాడినట్లు గుర్తించారు. అయితే ఆ పట్టుబడిన నటి బుర్రకథ సినిమాలో నటించిన నైరాషా గా గుర్తించారు.