డ్రగ్స్ వినియోగంలో ఏపీలోని మెగాసిటీ విశాఖ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే డ్రగ్స్, గంజాయి కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. తాజాగా MDMA డ్రగ్స్ తెప్పించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు శుక్రవారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్ సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. కడిపిలంక నుంచి పూలు కొనుగోలు చేసి, అనకాపల్లికి చెందిన ఇద్దరు మహిళలు స్వగ్రామానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బొలెరో…
తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ వవ్యహారంలో ఇప్పటికే నటుడు శ్రీరామ్ అరెస్ట్ అయ్యాడు. విచారణలో భాగంగా శ్రీరామ్ ఇచ్చిన సమాచారంతో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన మరో నటుడు కృష్ణను కూడా అరెస్ట్ చేసారు పోలీసులు. కృష్ణ తో పాటు డ్రగ్స్ డీలర్ కెవిన్ కు కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా జూలై పదవ తేది వరకు రిమాండ్ విధించింది కోర్డు. నటుడు కృష్ణ ఇంటిలో సోదాలు నిర్వహించిన పోలీసులు కీలక…
తమిళ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. అన్నాడీఎంకే మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ అరెస్ట్ తో ఈ డ్రగ్స్ వ్యవహారం బట్టబయలైంది. పోలీసులు విచారణలో తమిళ నటుడు శ్రీరామ్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ప్రసాద్ చెప్పడంతో కోలీవుడ్ లో అలజడి రేగింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీరామ్ ను అరెస్ట్ చేసి అతడి వద్ద నుండి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నుంగంబాకం జైల్లో ఉన్నారు. శ్రీరామ్ ను విచిరించిన పోలీసులు కీలక…
కోలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో ఇరుకున్నాడు. ఏపీలోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాలలో నటించాలని చిన్నప్పుడే చెన్నై వెళ్ళిపోయాడు. శ్రీకాంత్ పేరును కాస్త శ్రీరామ్ గా మార్చుకుని చిన్న చిన్నపాత్రల్లో నటిస్తూ రోజా పూలు సినిమాతో హీరోగా తెలుగు, తమిళ లో ఎంట్రీ ఇచ్చాడు. ఒకరికి ఒకరు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని తెలుగు, తమిళ,కన్నడలో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు శ్రీరామ్. ఇటీవల హరికథ అనే వెబ్ సిరీస్ లోను అలరించాడు. Also…
మంగ్లీ బర్త్ డే పార్టీ వివాదంగా మారింది. స్నేహితులు, బంధువుల మధ్య ఉల్లాసంగా జరుపుకోవాలనుకున్న బర్త్ డే పార్టీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడం, లిక్కర్ సరఫరా చేయడం, గంజాయి తాగిన వ్యక్తి పట్టుబడటంతో కేసు నమోదు వరకు వెళ్ళింది. సరిగా బర్త్ డే రోజే చేవెళ్ల పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ పై కేసు నమోదు అయింది. త్రిపుర రిసార్ట్స్ లో విపరీతమైన సౌండ్ పొల్యూషన్ తో పార్టీ…
రాజ్ తరుణ్ భార్యగా చెప్పుకుంటున్న లావణ్య మస్తాన్ సాయి అనే యువకుడి హార్డ్ డిస్క్ పోలీసులకు అందజేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారం మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజాగా మరికొన్ని వీడియోలను లావణ్య స్వయంగా విడుదల చేసింది.మస్తాన్ సాయికి సంబంధించిన కొన్ని వీడియోలను లావణ్య విడుదల చేసింది. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీ వీడియోతో పాటు కొన్ని ఫోటోలు సైతం లావణ్య విడుదల చేసింది.…
Bandi Sanjay : ఇచ్చిన హామీలపై ప్రజల ద్రుష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం… బీఆర్ఎస్ ను మించి పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ కేసు అంటూ ప్రతినెలా ఏదో అంశంపై ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు తలమీదకు వస్తుండటంతో… కొత్తగా రైతు భరోసా…