ఇటీవల ‘దేవర’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రజంట్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్2’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కాబోతుందట. ఈ సినిమా మీద ఉన్న అంచనాల ప్రకారం ఏ మాత్రం టాక్ బాగున్నా కూడా ఊహకందని కలెక్షన్స్ తో రికార్డుల జాతర సృష్టించడం పక్క. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.
Also Read: Sri Leela: బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో బోల్డ్ పాత్రలో శ్రీలీల..
ప్రజెంట్ ఇప్పుడు ప్రతి ఒక భారీ చిత్రం లో స్పెషల్ సాంగ్ కచ్చితంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ ‘వార్2’ లో కూడా ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఇంతకీ ఎవరితో ఈ సాంగ్ చేస్తున్నారు అంటే.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తో. ఈ ఇయర్ ఇండిపెండెంట్స్ వీకెండ్ లో బాలీవుడ్ రికార్డుల జాతర సృష్టించిన ‘స్త్రీ 2’ మూవీ లో నటించిన శ్రద్ధా కపూర్ ఎంత మంచి గుర్తింపు సంపాదించుకుందో మనకు తెలిసిందే. కాగా ఈ ‘వార్2’ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధా ని లైన్ లో పెట్టరట. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఆల్రెడీ ఎన్టీఆర్ ఇంట్రో సాంగ్, హృతిక్ సాంగ్ తో పాటు ఇద్దరి కాంబోలో ఒక మాస్ డాన్స్ నంబర్ ఉండబోతుందట. ఇక ఇప్పుడు వాళ్ళ కాంబోలో ఊర మాస్ ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేసినట్లు లేటెస్ట్ సమాచారం. అంతేకాదు ఈ స్పెషల్ సాంగ్‌ని బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటెం సాంగ్స్ లో ఒకటిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.