నందమూరి నటసింహం బాలకృష్ణ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ” షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. మాస్ డైరెక్టర్ బోయపాటి ఈ మూవీని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. టీజర్ తోనే ఫుల్ గా హైప్ పెంచేసాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ సినిమా కథ గురించి తన పరిశోధనల అనంతరం స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సెషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.
Read Also : కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమౌతున్న సూపర్ స్టార్ మనవరాలు
ఈ విషయం తెలియజేస్తూ తమన్ తో కలిసి ఉన్న పిక్ ను గోపీచంద్ షేర్ చేసుకున్నాడు. ‘మరో “క్రాక్” కోసం మేము సిద్ధమవుతున్నాము. ఈసారి బాలయ్య 107 చిత్రం కోసం’ అంటూ ట్వీట్ చేసాడు. ఆయన ట్వీట్ కి రిప్లై గా తమన్ ఈసారి కచ్చితంగా బాలయ్య 107 ఫైర్ క్రాకర్ అవుతుందంటూ ట్వీట్ చేశాడు. ఇక బాలయ్య ఈ మూవీని స్టార్ట్ చేయడమే ఆలస్యం. గోపీచంద్ మలినేని ఈ ఏడాది మొదట్లో రవితేజతో కలిసి “క్రాక్” మూవీతో థియేటర్ లోకి వచ్చాడు. ఏడాది ప్రారంభంలోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ తో బాలయ్యతో సినిమా చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు.