మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ వీరిద్దరి మధ్య పోటీ అంటే దక్షిణాది సినిమా అభిమానులందరికీ ఓ ప్రత్యేకమైన ఆసక్తి ! అందులోనూ ఈ ఇద్దరు టాప్ స్టార్స్ పొంగల్ బరిలో పోటీ పడడమంటే మరింత ఆసక్తి పెరుగుతుంది.
నటసింహ నందమూరి బాలకృష్ణ 107వ చిత్రానికి 'వీరసింహారెడ్డి' అనే టైటిల్ ను ఖరారు చేయగానే అభిమానుల ఆనందం అంబరమంటుతోంది. ఎందుకంటే 'సింహా' అన్న పదం నందమూరి బాలకృష్ణకు భలేగా కలసి వస్తుందని వేరే చెప్పక్కర్లేదు.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తోన్న బాలయ్య.. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ (NBK108) చేయనున్న విషయం తెలిసిందే! ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సైతం చకచకా జరుగుతున్నాయి. తండ్రి, కూతురు మధ్య బంధం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూతురి పాత్రకు శ్రీలీలను ఎంపిక చేయడమూ జరిగింది. హీరోయిన్, ఇతర ప్రధాన నటీనటుల్ని ఎంపిక చేసి.. సెట్స్ మీదకి తీసుకెళ్లడమే తరువాయి. ఈ…
NBK107 సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి దసరాకే రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతూ వస్తోంది. చిత్రీకరణ కూడా గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతుండడంతో.. ఈ సినిమా దసరాకి రావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు దసరాకి సినిమా రాకపోవచ్చని సమాచారం. ఇందుకు కారణం.. బాలయ్యకి కరోనా సోకడమే! ఇటీవల టెస్టులు నిర్వహించగా.. బాలయ్యకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది తదుపరి షెడ్యూల్స్‌పై కూడా ప్రభావం చూపింది. తద్వారా…
ఒకప్పుడు అమెరికాలో షూటింగ్ నిర్వహించడం చాలా సులువుగా ఉండేది. వీసా కూడా ఈజీగా దొరికేది. కానీ, కరోనా వల్ల ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వీసా కోసం నెల రోజుల వరకూ వేచి ఉండాల్సి వస్తోంది. దీనికితోడు నియమ, నిబంధనలు మరింత కఠినంగా మారాయి. దీంతో.. అమెరికాలో షూటింగ్ నిర్వహించాలంటే, పెద్ద తలనొప్పిగా మారింది. ‘సర్కారు వారి పాట’ చిత్రబృందాన్ని వీసా సమస్యలు ఎలా వెంటాడాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. వీసా సమస్యల వల్లే షూటింగ్ వాయిదా…
‘అఖండ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నందమూరి నటసింహాం బాలకృష్ణ.. అదే ఊపులో అభిమానులకు మరో హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమా షూటింగ్.. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ బాలకృష్ణ పై హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట రామ్-లక్ష్మణ్. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. రీసెంట్‌గానే ఈ సినిమా సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది…
NBK107.. సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా టైటిల్ ఏంటా? అని చర్చలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నప్పుడు టైటిల్ అనౌన్స్ చేయడం టాలీవుడ్ ఆనవాయితీ. కాబట్టి, NBK107 ఫస్ట్ లుక్ రిలీజ్ టైంలో కచ్ఛితంగా టైటిల్ ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ, మేకర్స్ అందరి ఆశలపై నీళ్లు చల్లేశారు. పవర్‌ఫుల్ పోస్టర్‌ని విడుదల చేశారే గానీ, టైటిల్ మాత్రం ప్రకటించలేదు. పోనీ, టీజర్ సమయంలో అయినా రివీల్ చేస్తారా అంటే,…
NBK107 మేకర్స్ శరవేగంగా కానిస్తున్న పనులు చూసి.. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకొని జూన్ 10వ తేదీన ఏదైనా క్రేజీ అప్డేట్ రావొచ్చని అంతా అనుకున్నారు. అదే నిజమైంది. లేటెస్ట్‌గా యూనిట్ సభ్యులు ఇచ్చిన అప్డేట్‌ని బట్టి చూస్తే.. జూన్ 10న లేదా అంతకుముందు రోజే NBK107 టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. ‘సింహం వేటకు సిద్ధం.. #NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్’ అనే క్యాప్షన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో..…