Single Screen vs Multiplex: టాలీవుడ్లో పర్సంటేజ్ షేర్ ఎలా ఉంటుందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు సైలెంట్‌గా సాగిన థియేటర్ల నిర్వహణ వ్యవహారం.. ఇప్పుడు కలెక్షన్ల పంపకాల దగ్గరికి వచ్చేసరికి రచ్చకెక్కింది. మల్టీప్లెక్స్‌ల హవా పెరిగిపోతున్న ఈ రోజుల్లో, నష్టాల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు తమ మనుగడ కోసం ఒక కీలకమైన డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. అదే “పర్సంటేజ్ సిస్టమ్”. ప్రస్తుతం నడుస్తున్న సాంప్రదాయ రెంట్ విధానం వల్ల తాము దారుణంగా నష్టపోతున్నామని, మల్టీప్లెక్స్‌ల తరహాలోనే తమకు కూడా కలెక్షన్లలో వాటా కావాలని సింగిల్ స్క్రీన్ ఓనర్లు గళమెత్తారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ఇంతలా పట్టుబట్టడానికి కారణం.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆదాయ పంపకాల వ్యత్యాసాలే. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద ₹1 కోటి రూపాయల గ్రాస్ వసూలు సాధించిందని అనుకుంటే.. ప్రస్తుత లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. సింగిల్ స్క్రీన్ (ఫిక్స్డ్ రెంట్ విధానం)లో ₹7 లక్షలు అద్దె మాత్రమే వారికి ఉంటుంది. మిగిలిన ₹93 లక్షలు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా నిర్మాతలకు వెళతాయి.
Also Read
- Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
- Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
- Mem Cop Lam : ‘మేము కాప్‌లం’ సిరీస్‌ను 17 రోజుల్లోనే ఎలా షూట్ చేశారంటే?
- Puri Jagannadh: “ఫిజిక్స్ ముందు సెల్ఫ్ కంట్రోల్ నేర్పండి”..స్కూళ్లపై పూరి జగన్నాథ్ ఫైర్..
మల్టీప్లెక్స్ ల పర్సంటేజ్ విధానం ప్రకరం ₹45 లక్షలు మల్టీప్లెక్స్ ఉంచుకుని ₹55 లక్షలు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా నిర్మాతలకు వెళతాయి. ఈ గణాంకాలను గమనిస్తే అసలు వ్యత్యాసం అర్థమవుతుంది. ఒకే రకమైన బిజినెస్ జరుగుతున్నప్పుడు, మల్టీప్లెక్స్ యజమానులకు భారీగా లాభాలు దక్కుతుంటే.. సింగిల్ స్క్రీన్ నిర్వాహకులకు మాత్రం కేవలం నామమాత్రపు ఫిక్స్డ్ రెంట్లు మాత్రమే మిగులుతున్నాయి. సినిమా సూపర్‌హిట్ అయి కోట్లు కురిపించినా, సింగిల్ స్క్రీన్ ఓనర్‌కు వచ్చే అద్దె రూపాయి కూడా పెరగదు. అదే సినిమా ఫ్లాప్ అయితే, కనీస నిర్వహణ ఖర్చులు (కరెంట్ బిల్లులు, స్టాఫ్ శాలరీలు) కూడా రాక థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ వివక్షకు స్వస్తి పలికి, సింగిల్ స్క్రీన్లను కాపాడుకోవడానికి ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఒక సరైన పరిష్కారాన్ని ప్రతిపాదించింది. అదే 60:40 రేషియో.ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. థియేటర్‌కు వచ్చే కలెక్షన్ల షేర్లో 60% వాటా నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లకు వెళ్తుంది, మిగిలిన 40% వాటా థియేటర్ యజమానికి దక్కుతుంది. అయితే ఇప్పటికిప్పుడు అలా చేసేందుకు చాలా పెద్ద సినిమాల నిర్మాతలు సిద్దంగా లేరు.
తాజావార్తలు
-
Single Screen vs Multiplex: టాలీవుడ్లో పర్సంటేజ్ షేర్ ఎలా ఉంటుందంటే ?
-
Petrol, Diesel Price Hike: మళ్ళీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
-
PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!