Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మకు విషపురుగు కరిచింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే, ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన పీఏ సుభాశిష్ పాండా ఒక వీడియో రిలీజ్ చేశారు. రాజేష్ శర్మకు ఎలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదని పేర్కొన్న ఆయన, రాజేష్ శర్మకు ఉన్న షుగర్ వల్ల కాలు కొద్దిగా వాచిందని, అందుకే హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని, ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడా అవుతారని సుభాశిష్ పేర్కొన్నారు.
రాజేష్ శర్మకు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తుండగా ఏదో అయ్యిందని సోషల్ మీడియాలో, కొన్ని మీడియా ఛానల్స్‌లో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధమని సుభాశిష్ పాండా స్పష్టం చేశారు. రాజేష్ శర్మ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు తాను ఉంటానని, హైదరాబాద్‌లో అలా ఏమీ జరగలేదని, కేవలం కొందరు తమ స్వార్థం కోసం ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దయచేసి ఇలాంటి నిజానిజాలు తెలియని ఫేక్ న్యూస్‌లను సోషల్ మీడియాలో వైరల్ చేయవద్దని సుభాశిష్ పాండా కోరారు.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?