Movie Ticket Prices: సినిమాలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా, కుటుంబ సమయాన్ని గడిపేందుకు ఓ మార్గం. ముఖ్యంగా వారం రోజుల పని ఒత్తిడి నుండి బయట పడేందుకు, కొందరు కుటుంబ సభ్యులతో పాటు బయటికి వెళ్లే సరదా మూమెంట్స్‌లో సినిమాలు ప్రధాన భాగంగా నిలుస్తున్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో థియేటర్లలో టికెట్ ధరలు అధికంగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలకు ఇది కాస్త భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
సినిమా థియేటర్లపై తనిఖీల ఎఫెక్ట్ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.. ప్రభుత్వ తనిఖీల ఎఫెక్ట్‌తో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు దిగివస్తున్నాయి.. ఇప్పుడు సినిమా థియేటర్లతో పాటు, మల్టీప్లెక్స్‌లు ఆహార పదార్థాల ధరలపై 10 శాతం నుండి 20 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించి విక్రయాలు సాగిస్తున్నాయట.. అంతేకాదు.. బై వన్.. గెట్ వన్.. ఆఫర్లతో వినియోగదారులను తినుబండారాలు విక్రయిస్తున్నారు.
తెలుగు చిత్రపరిశ్రమలో అతి పెద్ద నిర్మాణ సంస్థ అంటే మైత్రి మూవీ మేకర్స్.. ఎన్నో వందల సినిమాలను తమ బ్యానర్ పై నిర్మించారు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నిర్మిస్తు జోరు మీద ఉన్నారు.. ఒక్క తెలుగులోనే కాదు హిందీ, తమిళ్లో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు.. ఈ నిర్మాణ సంస్థ మొదలు పెట్టిన ఆరంభంలోనే భారీ ప్రాజెక్టు లను నిర్మిచారు.. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమాలను అందుకున్న ఈ నిర్మాణ సంస్థ…
సినీ హీరోలు, హీరోయిన్లు సినిమాలతో పాటుగా బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి అనే సామెతను సినీ స్టార్స్ గట్టిగానే ఫాలో అవుతున్నారు.. అందుకే చాలా మంది పలు బిజినెస్ లు చేస్తున్నారు.. అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు.. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా మరోవైపు సొంతంగా వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నగరాల్లో మల్టీఫ్లెక్స్ లను నిర్మిస్తున్నారు..…
ఒకప్పుడు సినిమాలను చూడటానికి సింగిల్ థియేటర్స్ వెళ్ళేవాళ్లు.. కానీ ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్ లుగా మారిపోతున్నాయి.. అక్కడ జనాలు ఎక్కువగా సినిమాలు చూడటం వల్ల సింగల్ థియేటర్ల వైపు వెళ్లడం జనాలు తగ్గించేశారు.. టికెట్ ధర ఎక్కువైన కూడా మల్టీప్లెక్స్ లలోనే సినిమాలను చూస్తున్నారు.. కొంతకాలం కింద మెయింటైన్ చేయలేక మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఇప్పుడు మల్టీప్లెక్స్ లుగా మారిపోతున్నాయి.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు లో ప్రతి శుక్రవారం పండగే. అక్కడ ఉన్న…
T20 Worldcup 2022: ఈనెల 23 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే అన్ని పనులు ఆపుకుని మరీ టీవీల ముందు అతుక్కుపోతుంటాం. మరి అలాంటి మ్యాచ్ థియేటర్లలో వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్‌ను థియేటర్లలో చూసే అవకాశాన్ని మల్టీప్లెక్సులు కల్పించబోతున్నాయి. ఈ మేరకు ఐసీసీతో ఐనాక్స్…
indias national cinema day: రూ.75కే థియేటర్లో సినిమా చూడొచ్చు.. ఈనెల 16న ‘జాతీయ సినిమా దినోత్సవం’ నిర్వహించాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MAI) నిర్ణయించింది. దీంతో ఆరోజు మల్టీప్లెక్సులతోపాటు దేశవ్యాప్తంగా సుమారు 4 వేల థియేటర్లలో రూ.75కే సినిమాను వీక్షించే అవకాశాన్ని MAI కల్పిస్తోంది. బాలీవుడ్ కపుల్స్ రణ్ బీర్ సింగ్, ఆలియా భట్ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్రం’ ఈనెల 9న విడుదల కానుండగా.. ఈ సినిమాతోపాటు ఇతర సినిమాలను కూడా 16న రూ.75కే చూడండి.…
Cinema theaters to open in Kashmir after 30 years: సుమారు 3 దశాబ్దాల తర్వాత కశ్మీరీలు థియేటర్లో సినిమా చూడబోతున్నారు. కశ్మీర్ లోయలో హింస కారణంగా 1990లో అక్కడి ప్రజలకు సినిమా వినోదం దూరమైంది. భయాందోళనలు, దాడి జరుగుతుందోనన్న భయం కారణంగా అక్కడ సినిమా థియేటర్లు మూసివేశారు. ఇప్పుడక్కడ మునుపటితో పోల్చితే ఓ మోస్తరు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కశ్మీరీ ప్రజలకు సినిమా వినోదం మళ్లీ చేరువ కానుంది.…