థియేటర్లకు సంబంధించిన తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరుతూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) ఒక ప్రకటన జారీ చేసింది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు సినిమా థియేటర్లను కేవలం షేర్ ఆధారిత వ్యవస్థ ద్వారా నడపాలని లేదా పర్సంటేజ్ పద్ధతుల ఆధారంగా నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారని కొన్ని న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలన్నీ పూర్తిగా అసత్యమని, ఇటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని టీఎస్‌ఎఫ్‌సీసీ స్పష్టం చేసింది.
కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుని ఇప్పుడిపుడే సినిమాల విడుదలలు ఊపందుకుంటున్నాయి. గత వారం ‘పాగల్, రాజరాజచోర’ వంటి సినిమాలు ఆడియన్స్ ముందుకు రాగా ఈ వారం ‘శ్రీదేవి సోడాసెంటర్, ఇచ్చట వాహనములు నిలుపరాదు’ పలకరించాయి. వచ్చే వారం ‘సీటీమార్’, ఆ పై వారం ‘లవ్ స్టోరీ’ విడుదల కాబోతున్నాయి. ఇక ‘లవ్ స్టోరీ’ విడుదలవుతున్న రోజునే ఓటీటీలో నాని నటించిన ‘టక్ జగదీష్’ రిలీజ్ ని అధికారికంగా ప్రకటించారు. Read Also: ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ…
ఆగస్ట్ 20వ తేదీ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ థియేటర్స్ అసోసియేషన్ లో కొందరు చేసిన ఆరోపణలను యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది. కొవిడ్ కారణంగా సినిమా రంగంలోని అన్ని విభాగాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ సమయంలో అంతా కలిసి మెలిసి ముందుకు సాగాల్సింది పోయి… ఓ వ్యక్తిని, ఓ నిర్మాతను టార్గెట్ చేస్తూ విమర్శించడం సరికాదని తెలిపింది. ఇలా వ్యక్తులను, నిర్మాతలను ఏ ఒక్క శాఖ విమర్శించినా ఊపేక్షించేది లేదని తేల్చి చెప్పింది.…
‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడాన్ని, మరీ ముఖ్యంగా ఆ సినిమాను ‘లవ్ స్టోరీ’ విడుదల రోజునే స్ట్రీమింగ్ చేయించాలని అనుకోవడాన్ని శుక్రవారం తెలంగాణ సినిమా థియేటర్స్ అసోసియేషన్ తప్పు పట్టింది. వారు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న పలువురు థియేటర్ ఓనర్స్ ‘టక్ జగదీశ్’ హీరో నానిపై వ్యక్తిగత విమర్శలూ చేశారు. అయితే…. శనివారం ఆ విషయమై తెలంగాణ సినిమా థియేటర్స్ అసోసియేషన్ క్షమాపణలు కోరింది. ఎవరినీ వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ విమర్శించడం తమ అభిమతం…