సౌత్ ఇండస్ట్రీలో తక్కువ టైంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్‌లో ఏదో చేసేద్దామని నార్త్ బెల్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ టైంలోనే విజయ్ వర్మతో రిలేషన్ స్టార్ట్ చేసి మీడియాకు అటెన్షన్ ఇచ్చింది. సినిమాలతో కన్నా ప్రియుడితో షికార్లుచేస్తూ ముంబయి పాపరాజీస్ ఫోటోలకు ఫోజులిచ్చింది. అలా అని పూర్తిగా సౌత్ ఇండస్ట్రీని వీడలేదు. బాహుబలి తర్వాత ఎఫ్ 2, ఎఫ్ 3, జైలర్, ఆరణ్మనైలతో బాగానే ఆకట్టుకుంది అమ్మడు. ఎఫ్ 3 తర్వాత తనను క్రేజీ హీరోయిన్‌ను చేసిన టాలీవుడ్ పై ఫోకస్ తగ్గించింది మిల్కీ బ్యూటీ. ఈ టూ ఇయర్స్‌లో గుర్తుందా శీతాకాలం, భోళా శంకర్ చిత్రాలతో మాత్రమే పలకరించింది. ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.
Kicha Sudeep: కిచ్చా సుదీప్ మొదలెడుతున్నాడు !
దీంతో టీటౌన్‌తో కాస్త డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తూ.. మిగిలిన ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ చుట్టూ చక్కర్లు కొడుతుంది. స్త్రీ2, వేదలో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చిన బ్యూటీ, సికిందర్ కా ముక్వాదర్‌తో ఓటీటీ ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. బాలీవుడ్‌లో కూడా పెద్దగా బజ్ లేకపోవడంతో.. రూట్ మార్చి తెలుగు ఇండస్ట్రీలో వాలిపోయింది. క్రైమ్ థ్రిల్లర్ ఓదెల రైల్వేస్టేషన్ సీక్వెల్ ఓదెల 2లో నటిస్తోంది. రీసెంట్లీ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పుడు చూడని స్టన్నింగ్ లుక్స్ లో మెస్మరైజ్ చేసింది తమన్నా బ్యూటీ. ఇప్పటి వరకు గ్లామరస్ రోల్స్ లో పిచ్చెక్కించిన భామ.. ఫస్ట్ టైం డివోషనల్ టచ్ ఇస్తుంది. ఓదెల 2లో లేడీ అఘోరిగా కనిపించబోతుంది తమన్నా. ఓదెల 1 తెరకెక్కించిన అశోక్ తేజ.. పార్ట్ 2కూడా డీల్ చేస్తున్నాడు. సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. ప్రజెంట్ తమ్ము చేతిలో ఓదెల2 ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. మార్చిలో సినిమాను విడుదల చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. మరీ ఓదెల 2తో తెలుగులో గట్టి కంబ్యాక్ ఇస్తుందా…? సినిమాతో తెలుగులో బిజీగా మారుతుందా..? కొత్త సినిమాలు ఒప్పుకోకపోవడానికి విజయ్ వర్మతో ఏడడుగులు వేయబోతుందా? తమ్ము ఏం చేయబోతుందో వెయిట్ అండ్ సీ.