మ్యాక్స్‌తో హ్యాట్రిక్ హిట్స్ ఖాతాలో వేసుకున్న శాండిల్ వుడ్ హీరో కిచ్చా సుదీప్.. మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. లాస్ట్ ఇయర్ బర్త్ డే సందర్భంగా తన అప్ కమింగ్ వెంచర్ ఎనౌన్స్ మెంట్ చేశాడు ఈ కన్నడ బాద్ షా. బిల్లా రంగా బాషా అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి ఐదు నెలలు కావొస్తుంది కానీ.. సినిమా ఎంత వరకు వచ్చిందో తెలియని అయోమయంలో ఉన్నారు ఫ్యాన్స్. అదిగో ఆ టైంలోనే అదిరిపోయే క్లారిటీ ఇచ్చాడు శాండల్ వుడ్ స్టార్ హీరో.
Mahesh Reddy: నిర్మాత కొడుకు పెళ్లిలో చరణ్, ఎన్టీఆర్- మహేష్ మిస్సింగ్!
బిల్లా రంగా బాషా మార్చి సెకండ్ వీక్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతుందని ఎక్స్‌లో ట్వీట్ చేశాడు సుదీప్ . దీంతో ఫ్యాన్స్ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. విక్రాంత్ రోణతో భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ అనూప్ భండారికి మరో ఛాన్స్ ఇచ్చాడు కిచ్చా. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ టైం నుండే అంచనాలు పెంచేస్తున్నారు దర్శకుడు అనూప్ భండారీ. క్రీ శ. 2209లో స్టోరీగా ప్రజెంట్ చేయబోతున్నాడు డైరెక్టర్. మార్చి సెకండ్ వీక్ లో పట్టాలెక్కుతున్న ప్రాజెక్ట్ కోసం పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు అనూప్. బెంగళూరు శివార్లలో 4 ఎకరాల్లో ప్రత్యేకంగా వేయించిన సెట్స్‌లో బిల్లా రంగా బాషాను తీయబోతున్నాడు. ఈ సినిమా కోసమే 3డి సెట్స్ డిజైన్ చేశారని సమాచారం. ఇక ఇందులో వీఎఫ్ఎక్స్ వేరే లెవల్లో ఉండబోతుందని టాక్. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు హనుమాన్ నిర్మాతలు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోబోతుంది. మరీ ప్రాజెక్టుపై ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచేస్తున్న అనూప్ భండారీ.. ఆ ఎక్స్ పెక్టేషన్స్ రీచవుతాడో లేదో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.