సూర్య స్థానంలో హృతిక్! సాధ్యమేనా?

తమిళంలో రూపొంది తెలుగులోనూ మంచి మార్కులు సంపాదించిన ‘సూరరై పోట్రు’ సినిమా హిందీ తెర మీదకి వెళుతోంది. ఈ విషయాన్ని స్వయంగా హీరో సూర్య ప్రకటించాడు. అయితే, బాలీవుడ్ వర్షన్ కి కూడా సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నప్పటికీ హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు. సూర్య హిందీ వర్షన్ ‘సూరరై పోట్రు’లో నటించే అవకాశాలు దాదాపుగా లేనట్లే! మరి బీ-టౌన్ లో ‘సూరరై పోట్రు’ కథకి తగిన ఇంటెన్స్ యాక్టర్ ఎవరు?

Read Also : హైదరాబాద్ కు తిరిగొచ్చేసిన ప్రభాస్… స్పెషల్ లుక్ లో !!

ఓ బాలీవుడ్ సినీ పోర్టల్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ ప్రకారం… కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్ కి… హృతిక్ రోషన్ బెస్ట్ సూటెడ్ అని తెలుస్తోంది! ఓటింగ్ లో పాల్గొన్న వారిలో 67 శాతం మంది బీ-టౌన్ గ్రీక్ గాడ్ ని తమిళంలో సూర్య చేసిన పాత్రలో చూడాలనుకున్నారు. ఆయన తరువాతి స్థానాల్ని అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్ పంచుకున్నారు. దేవగణ్ 20 శాతం ఓట్లు సంపాదించగా, రణవీర్ 13 శాతానికే పరిమితం కావాల్సి వచ్చింది.

‘సూరరై పోట్రు’ హిందీ రీమేక్ ని… నిర్మాత విక్రమ్ మల్హోత్రాతో కలసి సూర్య సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. సుధా కొంగర హిందీలోనూ డైరెక్ట్ చేయబోయే సక్సెస్ ఫుల్ సౌత్ బయోపిక్ లో హృతిక్ నటిస్తాడా? ప్రస్తుతానికైతే సస్పెన్సే! ఎందుకంటే, ఆయన నెక్ట్స్ చేయాల్సిన మూడు భారీ చిత్రాలు క్యూలో ఉన్నాయి. ‘ఫైటర్, విక్రమ్ వేద, క్రిష్ 4’ చిత్రాలతో హృతిక్ బిజీగా ఉండబోతున్నాడు…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-