డ్యూడ్ సినిమాతో హ్యాట్రిక్ వంద కోట్ల హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు ప్రదీప్ రంగనాథ్. కానీ ఈ హీరో నటించిన లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ మూవీ చేయాలని ఏ నిమిషంలో ఫిక్స్ అయ్యాడో కానీ సమస్యల మీద సమస్యలు పుట్టుకొస్తునే ఉన్నాయి. 2024 జనవరిలో స్టార్టైన లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో గుమ్మడికాయ కొట్టేశారు. తండ్రి, కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడట విఘ్నేశ్ శివన్. సెప్టెంబర్ 18న రిలీజ్ కాబోతుందని కూడా ఎనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఆ డేట్ వాయిదా వేసి డిసెంబర్ 15న రిలీజ్ చేస్తామని మరో డేట్ ప్రకటించారు మేకర్స్.
Also Read : SSRMB : రాజమౌళి ‘వారణాసి’ బడ్జెట్.. రెమ్యునరేషన్స్ తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే?
LIK చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోతో పాటు, దర్శకుడు విఘ్నేష్ శివన్, నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్ కూడా ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అదే టైమ్ లో విఘ్నేష్ శివన్ కు శాటిలైట్, డిజిటల్ రైట్స్ అప్పగించేలా ఒప్పందం చేసుకున్నారు. అలాగే ఈ చిత్రం తమిళనాడు థియేట్రికల్ విడుదల హక్కులను సెవెన్ స్క్రీన్ స్టూడియో లలిత్ కుమార్ కలిగి ఉన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ టైమ్ దగ్గరపడుతోంది కానీ ఇప్పటికి నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్స్ క్లోజ్ కాలేదు. ఈ నేపధ్యంలో మరోసారి పోస్ట్ పోన్ చేయాలనీ లలిత్ కుమార్ భావించగా సినిమా విడుదలైన తర్వాత కూడా అమ్మకాలను తాను నిర్వహిస్తానని విఘ్నేష్ శివన్ చెప్పడంతో రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా తమిళ్ రైట్స్ ను రెడ్ జెయింట్ సంస్థ షెన్‌బగమూర్తి విడుదల చేయబోతున్నారు. ఆయన తన సొంత సంస్థ MSM కింద ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దాదాపు రూ. 15 కోట్లు అడ్వాన్స్ చెల్లించడానికి అంగీకరించినట్లు సమాచారం. మొత్తానికి డిజిటల్ డీల్ కాకుండానే రిలీజ్ అవుతుంది LIK.