టాలీవుడ్ హై యాంటిసిపెటెడ్ ఫిల్మ్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేశాడు రాజమౌళి. వారణాసిని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి. సైన్ ఫిక్షన్ విత్ మైథాలజీ టచ్ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు వెయ్యికోట్లు అనుకోగా ఇప్పుడు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్న నేపథ్యంలో బడ్జెట్ రూ. 1200 కోట్ల నుండి రూ. 1500 కోట్ల వరకు పెరిగిందన్నది లెటెస్ట్ బజ్. ఇక మహేష్ బాబు తో పాటు ఈ సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న జక్కన రెమ్యునరేషన్‌కు బదులు ప్రాఫిట్ లో షేర్ అని ఒప్పందం చేసుకున్నారు. అలాగే ప్రియాంక చోప్రా రూ. 30 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యాంటోగనిస్టుగా కనిపించబోతున్న పృధ్వీరాజ్ సుకుమార్ కూడా రూ. 10 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నాడని టాక్. ఇది కూడా బడ్జెట్ పెరగడానికి కారణమైందట.
వారణాసి సినిమా విషయంలోనే ఎక్కడా రాజీ పడని రాజమౌళి.. ఈవెంట్‌కు కూడా భారీగా ఖర్చు పెట్టించాడని ప్రెజెంట్ ట్రెండ్ అవుతోన్న న్యూస్. భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఈ ప్రోగ్రామ్ కోసం రూ. 30 కోట్ల వరకు వెచ్చించిదట ప్రొడక్షన్ హౌస్ శ్రీ దుర్గా ఆర్ట్స్. ఎల్ఈడీ స్క్రీన్స్ ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధులకు ఆతిథ్యం విషయంలోనే హ్యుజ్ అమౌంట్ ఖర్చైనట్లు తెలుస్తోంది. సినిమా మొత్తానికి అటు ఇటు గా రూ. 200 కోట్లు కేవలం ప్రమోషన్స్ మాత్రమే పెడుతున్నారని టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మొత్తానికి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఎలా కంప్లీట్ చేసినా సినిమాను మాత్రం రాజమౌళి 2027 సమ్మర్‌కు తీసుకు వస్తాడా లేదా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.