రాజ్ తరుణ్ భార్యగా చెప్పుకుంటున్న లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె రివీల్ చేసిన వివరాలు షాకింగ్ గా ఉన్నాయి. ఆమె రాసిన లేఖ యధాతంగా మీకోసం నేను రాజ్ తరుణ్ భార్యని, కోకాపేటలో నివసిస్తున్నాను. నాకు రాజ్ తరుణ్ కి గుంటూరు కి చెందిన రావి రామ్మోహనరావు కుమారుడు రావి బావాజీ మస్తాన్ సాయి, 2022 నుండి ఉన్నిత్ రెడ్డి (చింటూ) అనే ఫ్రెండ్ ద్వారా పరిచయం. నేను నవంబర్ 2024 లో మస్తాన్ సాయి ఇంటికి వెళ్లి తన 4 TB హార్డ్ డిస్క్ ని తీసుకొని వొచ్చాను. ఇలా చేయడానికి గల ప్రధాన కారణం, ఆ హార్డ్ డిస్క్ లో మస్తాన్ సాయి మహిళలకు తెలియకుండా తీసిన, వందలకొద్దీ నగ్న వీడియోలు ఉన్నాయి. వారిలో కొంతమంది పెళ్లి అయిన, కొంతమంది పెళ్లికాని వారి నగ్న వీడియోలు, వందలకొద్దీ మహిళల ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయి. అంతేకాకుండా మస్తాన్ సాయి Hack చేసి స్టోర్ చేసుకున్న ఎంతోమంది మహిళల జీవితాలు ఉన్నాయి. మస్తాన్ సాయి యువతుల ఫోన్లు హాక్ చేసి వారి గూగుల్ అకౌంట్స్, గూగుల్ ఫొటోస్ ఐ క్లౌడ్ అకౌంట్స్ తన ఆదీనంలో పెట్టుకొని, ఎవరు ఎదురు తిరగలేని పరిస్థితికి తీసుకొని వొస్తాడు. ఎదురు తిరగడం వల్ల కుటుంబ పరువుపోతుంది, మస్తాన్ సాయి జీవితాలు నాశనమ్ చేస్తాడు అనే భయం తో ఆ వీడియోలలో ఫోటోలలో ఉన్న ప్రతి ఆడపిల్ల మౌనంగా భరిస్తుంది. ఆ వీడియోలో ఉన్న ఏమహిళా ఎదురు తిరగలేదు. వాళ్ళకి శరీరంలో సెక్స్ కోరికలను పెంచే డ్రగ్స్ ఇస్తూ, తన కోరికలు తీర్చుకుంటూ వారికీ తెలిసి కొన్ని, మరియు వారికీ తెలియకుండా కొన్ని వీడియోలు రికార్డ్ చేసి ఈ హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసాడు. ప్రతి అమ్మాయి దగ్గర ఒక్కో డ్రామా, కొంతమందిని పెళ్లి చేసుకుంటాను అని, కొంతమందితో నేను తప్పు చేశాను ఉరి వేసుకొని చచ్చి పోతాను అని, ఆలా ఉరి వేసుకొని చచ్చి పోతున్నట్టు నమ్మించే వీడియోలు కూడా ఇదే హార్డ్ డిస్క్ లో ఉన్నాయ్. అంతేదుకు వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డి ఫోన్ హాక్ చేసి తీసిన వీడియోస్, ఫొటోస్, హీరో నిఖిల్ ఫోన్ లో ఉన్న ప్రైవేట్ పార్టీ వీడియోస్ కూడా ఈ హార్డ్ డిస్క్లోనే ఉన్నాయి. ఎంతోమంది మహిళల కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. వందల కొద్దీ వీడియోలు, వేలకొద్దీ ఫోటోలు. అతను ఎన్ని నేరాలు చేసాడో అన్ని కేసుల వివరాలు, ఆ నేరాలనుండి లీగల్ గా ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేసుకున్న పర్సెంటేషన్స్ కూడా ఉన్నాయి. లాయర్లతో ఎలా వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పిచుకోగలడో మాట్లాడే ఆడియోలు ఉన్నాయి. ఇంతకీ ఇతని దైర్యం ఏంటో తెలుసా ? కొడుకు ఇలాంటివాడు అని తెలిసినా, ఎన్ని కేసులు వున్నా వ్యవస్థల్ని డబ్బు పెట్టి మానేజ్ చేతున్న తన తండ్రి, రావి రామ్మోహనరావు.
నేను ఇప్పుడు ఇవన్నీ కంప్లైంట్ రూపంలో బయట పెట్టడానికి గల కారణం ఒక్కటే, మస్తాన్ సాయి పరిచయం వలన చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్న మహిళగా మిగిలాను. నాతో ఇతను వీడియో కాల్స్ మాట్లాడుతూ నాకు తెలియకుండా సుమారు 40 వీడియోలు రికార్డ్ చేసాడు. నేను ఎవరికీ చెప్పుకోలేను, వాడినుండి బయటపడలేను. నా అన్ని ఇమెయిల్ ఎకౌంట్ లు హాక్ చేసాడు. నన్ను తన చెల్లి పెళ్ళికి రమ్మని పిలిచి,నేను నా వీడియోల గురుంచి ప్రశ్నిస్తే, మస్తాన్ సాయి గుంటూరు లో 2023 లో నన్ను కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు, అప్పుడే ఈ విషయాన్నీ నేను రాజ్ తరుణ్ కి చెప్పగా, నేను సినీ హీరోగా ఉనాన్ను నా పేరు లేకుండా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పాడు. తగిలిన గాయాలతో, ఒంటిమీద కమిలిన దెబ్బలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చూపించగా వారు పోలీసువారికి MLC కేసుగా నమోదు చేసి, కేసు నమోదు చేశారు.
అప్పటినుండి నేను హైదరాబాద్ తిరిగి వచ్చి రాజ్ తరుణ్ విల్లా లో ఉంటున్నాను. ఆ కేసుని ఎలా అయినా రాజి చేసుకోవాలని భావించిన మస్తాన్ సాయి, తన బాధితురాల్లో ఒకరు అయిన దుగ్గిరాల స్వాతి అనే అమ్మాయిని నమ్మించి, ఆస్ట్రేలియా నుండి పిలిపించి సైబరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో నాపై కేసు పెట్టించాడు. ఆ కేసు పెట్టడానికి ఆ అమ్మాయితో ఎం మాట్లాడాడో, కేసు పెట్టకపోతే ఎలా బండబూతులు తిట్టాడో అన్ని ఆడియోలు ఇదే హార్డ్ డిస్క్ లో ఉన్నాయి. రాజ్ తరుణ్ కి నాకు గొడవలు జరుగుతుంటే కేసులలో హెల్ప్ గా ఉంటాను అని నమ్మించి, మస్తాన్ సాయి స్నేహితుడు అయిన గణేష్ అనే వ్యక్తికీ డ్రగ్స్ ఇచ్చి, నా ఇంటిలో వీడియో తీసుకుంటూ పెట్టమని, నాచేత ప్యాకెట్ ఓపెన్ చేయించి అడిగి మరీ తీసుకోమని మస్తాన్ సాయి కాల్ లో గణేష్ కి instructions ఇస్తూ పంపాడు. ఆ వీడియో కూడా ఇదే హార్డ్ డిస్క్ లో ఉంది. అలా అని నేను ఇన్నోసెంట్ అని చెప్పడం లేదు, నా తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు వెనక జరిగిన కుట్రలకి అన్ని ఆధారాలు ఇదే హార్డ్ డిస్క్‌లో ఉన్నాయి. నేను మంచిదాన్ని అని చెప్పడం లేదు, ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. ఆఖరికి శేఖర్ బాషాతో మస్తాన్ సాయి చేసిన వాట్సాప్ చాట్ హిస్టరీ కూడా ఇదే హార్డ్ డిస్క్‌లో ఉంది. మస్తాన్ సాయి మీద ఇప్పటికే నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రిమియాల్ నా దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ కోసం నా ఇంటికి వచ్చాడు. నేను హార్డ్ డిస్క్ ఇక్కడలేదు ఉన్న ఇవ్వును అని చెప్పే సరికి నా గొంతు గట్టిగా పట్టుకొని ఊపిరిఆడకుండా చేసి చంపబోయాడు. నా ఇంట్లో ఉన్న TV పగలగొట్టారు. CCTV కెమెరా damage చేసాడు. నేను బయపడి ఫ్రెండ్ ఇంటికి వొచ్చి 100 కి డయల్ చేసి పోలీసువారిని పంపాను. పోలీసు వారి దగ్గర నేను వెళ్ళిపోతున్నాను అని నమ్మించి మళ్ళీ అదే ఇంట్లో ఉన్నాడు. మరో ఇద్దరు వ్యకులతో ఇంట్లో కి వొచ్చి డ్రగ్స్ సేవిస్తూ నా తమ్ముడిని తన ఆదీనంలో ఉంచుకొని, నాకు కాల్స్ చేస్తూ, హార్డ్ డిస్క్ తీసుకొని రావాల్సిందిగా బెదిరింపులకు గురిచేస్తున్నాడు. నన్ను చంపి అయినా హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్తాడు. ఈ హార్డ్ డిస్క్ పోలీసు వారికి ఇచ్చినా సరే నాకు ప్రాణహాని తప్పదు. కానీ నాలాగా ఏ మహిళల జీవితాలు ఇలాంటి వెదవలు తీసే వీడియోలు వల్ల బలి కాకూడదు అని. నాకు న్యాయం జరిగినా, జరగక పోయినా, కనీసం ఈ ఫిర్యాదు చూసి అయినా మహిళలు జాగ్రత్త పడతారు అని, పోలీసు వారి పట్ల పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఫిర్యాదుతో పాటు అన్ని ఆధారాలు ఉన్న హార్డ్ డిస్క్ ని అందిస్తున్నాను. అలాగే మస్తాన్ సాయి వద్ద ఉన్న మిగిలిన రెండు హార్డ్ డిస్క్ లను అతని ఇమెయిల్ అకౌంట్స్, ఆపిల్ క్లౌడ్ అకౌంట్స్, అన్ని ఎలక్ట్రానిక్ డివైస్ పోలీసు వారు తీసుకొని మహిళలకు సంబంధించిన డేటా అంతా డిలీట్ చేయించాలి అని నా విన్నపము అంటూ ఆమె రాసుకొచ్చింది.