టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా కాదు అంతకు మించి అన్నట్లు పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ అడ్వెంచర్ యాక్షన్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ చిత్ర యూనిట్ కు బిగ్ షాక్ తగిలింది. మహేష్-రాజమౌళి మూవీ సెట్స్ నుంచి షూటింగ్ వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
Also Read:Chiranjeevi: హీరోయిన్ శ్రీలీలను సత్కరించిన మెగాస్టార్
లీకైన వీడియోలో మహేష్ బాబు నడిచొస్తుంటే.. వెనక నుంచి ఓ వ్యక్తి ముందుకు తోసుకుంటూ వస్తాడు. అలా వచ్చిన మహేష్ బాబు వీల్ చైర్ లో కూర్చున్న వ్యక్తి ముందు మోకాళ్లపై కూర్చుంటాడు. ఈ యాక్షన్ సీన్ కు సంబంధించిన వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతోంది. SSMB 29 నుంచి షూటింగ్ వీడియో లీక్ చేసిన వారిపై డైరెక్టర్ రాజమౌళి, చిత్ర యూనిట్ గట్టి చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో మహేష్ తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు.