ట్యాలెంట్ ఎవరి సొత్తు కాదు అని ఊరికే అనలేదు. అందం,సిని బ్యాగ్రౌండ్ ఉన్న కూడా హీరో కానీ హీరోయిన్ కానీ క్లిక్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే జనాలు ఊరికే ఎవరికి సపోర్ట్ చేయరు. నటన పరంగా ఆకట్టుకుంటే తప్ప. అలా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ. తన అందం, అమాయకత్వం తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. తెలగులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శంభో శివశంభో’, ‘డమరుకం’ వంటి చిత్రాల్లో నటించిన ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రీసెంట్‌గా విడుదలైన మలయాళ చిత్రం ‘పని’ నటిగా అభినయను మరోస్థాయిలో నిలబెట్టింది. చెవులు వినపడకుండా, మాటలు రాకున్నా.. కూడా తనలోని ట్యాలెంట్‌ని బయట పెట్టి తనని తాను నిరూపించుకుంది. ఇక తాజాగా అభినయ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంది.
Also Read: Producer : బన్నీ లుక్ గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చిన నిర్మాత
ఈ శుభవార్తను ఆమె తన ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. తనకు కాబోయే భర్తతో కలిసి గుడి గంటను మ్రోగిస్తూ.. చేతులు మాత్రమే కనిపిస్తున్న తమ ఎంగేజ్‌మెంట్ పిక్‌ని ఇన్‌స్టాలో షేర్ చేశారు అభినయ. ‘మమ్మల్ని మీ మంచి మనసుతో ఆశీర్వదించండి.. ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలు కానుంది’ అంటూ నోట్‌ని కూడా జత చేశారు. కానీ ఇంతకీ ఆమె పెళ్లాడబోయేది ఎవరిని? అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. అతని ముఖం మాత్రం చూపించలేదు. అయితే హీరో విశాల్‌తో అభినయ లవ్‌లో ఉన్నట్లు ఇప్పటికి చాలా రూమర్స్ వినిపించాయి. కానీ ఈ విషయం పై ఇద్దరు ఎప్పటికప్పుడు స్పందిస్తూ తమ మధ్య అలాంటిది ఏం లేదు అని తెలిపారు. ఇక ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ పిక్‌లో అభినయ తన కాబోయే భర్త ముఖం చూపించకపోవడంతో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. మరి ఇంతకీ ఆమె పెళ్లాడాబోయేది ఎవ్వరిని..?