Pawankalyan : పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ హంగామా.. దుమ్ములేపిన నిహారిక
- నిహారిక నిర్మాతగా రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు'
- 11 మంది నూతన నటీనటులతో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు
- ఆగస్టు 9న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిఠాపురంను దేశం యావత్తు తిరిగి చూసేలా చేసిన వ్యక్తి జనసేనాని అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో సినీ రంగానికి చెందినవారు కూడా పిఠాపురం వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా సినిమా ఈవెంట్స్‌ను అక్కడ నిర్వహిస్తున్నారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గానికి నిహారిక కొణిదెల వెళ్లి హంగామా చేశారు. బాబాయ్ పవన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గానికి మెగా డాటర్ వెళ్లటం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ టాక్..పూరి హిట్ కొడతాడా లేదా..?
Also Read
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 9న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. అందులో భాగంగా పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్ ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నుంచి వైజాగ్ ప్రాంతాలకు వెళ్లి అక్కడ సందడి చేసింది. అందులో భాగంగా పిఠాపురంకు చిత్ర యూనిట్ వెళ్లింది. అక్కడ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అక్కడి ప్రజలతో కాసేపు ముచ్చటించింది.
Also Read: Mahesh Babu: రీరిలీజ్ లో కూడా రికార్డు క్రియేట్ చేస్తున్న మహేశ్ సినిమా.. కలెక్షన్స్ ఎంతంటే..?
ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా మంచి డైలాగ్స్‌తో ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా రూపొందింది. మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే మన సమాజంలో జరిగే నిజ ఘటనల ఆధారంగా, మనం మన స్నేహితులతో ఎలా ఉంటామో అలాంటి సన్నివేశాలను పొందుపరుస్తూ సినిమాను రూపొందించారని స్పష్టమవుతుంది. స్నేహం గొప్పదనాన్ని తెలియజెప్పేలా ఉండే ఈ సినిమాను చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. దీంతో ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. సోమవారం హైదరాబాద్‌లో కమిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది. ఆగస్ట్ 9న రిలీజ్ కాబోతున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు.
Mana #CommitteeKurrollu kudaa PITAPURAM thaaluke andi babu!! 💥💥
9th August Theatres ki vasthunnaru! Kaludhaam 🥁#CKonAUG9 🍿@IamNiharikaK @SRDSTUDIOS_ @yadhuvamsi92 @eduroluraju @anudeepdev @anwaraliedit @manyam73 @urs_jdmaster @connect2vamsi @tseriessouth @Ticket_Factory pic.twitter.com/PLzZZjARvZ
— Pink Elephant Pictures (@PinkElephant_P) August 4, 2024
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!