సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9. ఈ సందర్భంగా అభిమానులు మహేశ్ బర్త్ డేను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో రక్తదాన శిబిరం వంటివి నిర్వహించబోతున్నారు. జిల్లాల వారీగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాజమౌళి – మహేశ్ ల పాన్ ఇండియా సినిమా అప్ డేట్ ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హీరోల బర్త్ డే కానుకగా సినిమాల రీరిలీజ్ ట్రెండ్ మొదలు పెట్టెంది మహేశ్ అభిమానులే. గతేడాది పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ స్టార్ట్ చేశారు.
Also Read: Nani: 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలవడం పట్ల నేచురల్ స్టార్ నాని ఫస్ట్ రియాక్షన్..
ఈ నేపథ్యంలో ఘట్టమనేని అభిమానులు మహేశ్ సూపర్ హిట్ సినిమాలను వరల్డ్ వైడ్ గా రీరిలీజ్ చేయబోతున్నారు. మహేశ్ నటించిన మురారి, ఒక్కడు చిత్రాలను 4K క్వాలిటీతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి విడుదల చేయబోతున్నారు. మరి ముఖ్యంగా మురారి అప్పట్లో ఎంతటి సూపర్ హిట్ సాధించిందో రీరిలీజ్ లోనూ అదే స్థాయిలో హంగామా చేస్తోంది. కాగా నైజాంలోని హైదరాబాద్ లో అడ్వాన్స్ సేల్స్ లో ఫాస్టెస్ట్ రూ. 50 లక్షలు కలెక్షన్లు రాబట్టిన సినిమాగా మురారి రికార్డు నమోదు చేసింది. మరో వైపు బుక్ మై షో లో గడిచిన 24 గంటలో 40.01టికెట్స్ బుక్ అయ్యి రికార్డు సృస్టించి, ఇంతకు మునుపు బిసిజినెస్ మాన్ పేరిట ఉన్న రికార్డు ( 38.2K) రికార్డుని తిరగరాసింది మురారి. మరీ ముఖ్యంగా మహేశ్ బాబు అడ్డాగా భావించే సుదర్శన్ 35MMలో ఆగస్టు 9నాడు ఒక్క టికెట్ కూడా మిగలలేదంటే మహేశ్ క్రేజ్, ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉందొ అర్ధం అవుతుంది.